Advertisement

కరోనా పీపీఈ కిట్లుతో దాండియా డాన్సులు...!

By: Anji Fri, 23 Oct 2020 06:35 AM

కరోనా పీపీఈ కిట్లుతో దాండియా డాన్సులు...!

కోల్ కతా లోని దుర్గా పూజా క్లబ్ అనే సంస్థ పీపీఈ కిట్లు ధరించిన డ్యాన్సర్లతో ‘దాండియా’ నృత్యాన్ని నిర్వహించింది. వివేకానంద స్పోర్టింగ్ క్లబ్ అనే ఈ సంస్థ ఇలా వినూత్నంగా దీన్ని నిర్వహించడం అనేకమందిని ఆకర్షించింది.

కోవిడ్ ప్రోటోకాల్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే ఈ సరికొత్త ‘ప్రయోగాన్ని’ చేపట్టామని ఈ క్లబ్ సభ్యులు తెలిపారు. అయిదు రోజులపాటు ఇలాగే పీపీఈ కిట్లతో డ్యాన్సర్లు మెప్పిస్తారని వారు చెప్పారు.

వీరు మాస్కులు, గ్లాసెస్, క్యాప్స్ కూడా ధరించి ఈ దాండియాలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ లో చాల,మంది మహిళలతో బాటు కొందరు యువకులు కూడా ఉత్సాహంతో దాండియా డ్యాన్సులు చేస్తారు.

Tags :

Advertisement