Advertisement

  • ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్

ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్

By: chandrasekar Fri, 28 Aug 2020 3:17 PM

ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్


అనంతపురం జిల్లా శెట్టూరులో జరిగింది. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడు డ్యాన్స్‌ క్లాసులు నిర్వహిస్తుంటాడు. గ్రామానికి చెందిన ఓ బాలిక కొద్దిరోజులుగా అతడి వద్ద డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఆమెపై కన్నేసిన రాము ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.

తాను చెప్పిన చోటుకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో గురువారం బాలిక అతడి వద్దకు వెళ్ళింది. రాము తన ముగ్గురు స్నేహితుల సహకారంతో బాలికను శెట్టూరు చెరువుకట్ట సమీపంలోని తాతయ్యగుడి వద్దకు రప్పించి అక్కడి నుంచి టాటాఏస్‌ వాహనంలో కళ్యాణదుర్గం మండలం గోళ్ల ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు తీసుకెళ్లాడు.

నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో పొదల చాటుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను కళ్యాణదుర్గం బైపాస్‌లో బళ్లారి రోడ్డు మిట్టపై వదిలేసి పారిపోయాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement