Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న డీఏ

By: chandrasekar Sat, 19 Dec 2020 10:40 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న డీఏ


దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వున్న 17 శాతం డీఏ ను ప్రస్తుతం పెంచనుంది. ఇందువల్ల వారి వేతనాలు పెరగనుంది. ఇందుకోసం కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ ను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు తెలిపారు. ఈ పెంపుదల వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు మరియు 60 లక్షల మందికి పైగా పింఛన్‌దారులకు లబ్ధి కలగనున్నట్లు తెలిపారు.

అసలు కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నిలిపివేసిన డీఏను కూడా ప్రభుత్వం ఇప్పుడు పునరుద్ధరించింది. అసలు డీఏ పెంపుపై కేంద్రం గత మార్చి నెల లోనే నిర్ణయం తీసుకున్నది. కానీ కరోనా కారణంగా దీని అమలుపై ఏప్రిల్ ల్లో ఆంక్షలు విధించారు. మాములుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండుసార్లు డీఏ పెంచుతారు. ప్రస్తుతం 7వ వేతన కమిషన్‌ సిఫారసుల మేరకు ఉద్యోగుల డీఏ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని వల్ల రానున్న కొత్త సంవత్సరంలో కేంద్ర ఉద్యోగుల వేతనాలు పెరగనుంది.

Tags :
|
|

Advertisement