Advertisement

  • ఖాతా దారుని ఖాతాలో డబ్బులు దోచేసిన సైబర్ నేరగాళ్లు

ఖాతా దారుని ఖాతాలో డబ్బులు దోచేసిన సైబర్ నేరగాళ్లు

By: chandrasekar Mon, 10 Aug 2020 7:28 PM

ఖాతా దారుని ఖాతాలో డబ్బులు దోచేసిన సైబర్ నేరగాళ్లు


డిజిటల్ వ్యవస్థ లావాదేవీలను ఎంత సులభతరం చేస్తే అదే విధంగా సైబర్ దోపిడీలకు అవకాశాలు పెరుగుచున్నాయి. కరోనా సమయంలో సైబర్ నేరగాళ్లు బాగా రెచ్చిపోయి వివిధ మార్గాల్లో అకౌంట్ల నుండి డబ్బులు దోచేస్తున్నారు. కొత్త, కొత్త మార్గాల్లో స్మార్ట్‌గా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు కూడా తెలియకుండా డబ్బు మాయం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.

నగరంలోని త్రీటౌన్‌ పరిధిలో ఉన్న విద్యానగర్‌కు చెందిన గుమ్మళ్ళ రాజేష్‌ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఇటీవల చనిపోడంతో ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు అకౌంట్లో జమయ్యాయి. తండ్రి రాయితీ డబ్బులు తల్లి బ్యాంకు అక్కౌంట్‌లో జమ కావడంతో ఈ సొమ్మును బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు ఈనెల 7న రాజేష్‌ తన తల్లిని తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నం చేయగా అకౌంట్‌లో డబ్బులు డ్రా చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ తిన్నారు.

వెంటనే వారు బ్యాంక్ మెనేజర్‌ను సంప్రదించగా జూన్‌ నెల నుంచీ ఏటీఎం ద్వారా 28సార్లు డబ్బును ఎవరో డ్రా చేసినట్లు చెప్పారు. బాధితులు వెంటనే ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేష్ తల్లి అకౌంట్‌లో నుంచి డబ్బును సైబర్ నేరగాళ్లు మాయం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ డబ్బును ఎలా డ్రా చేశారో ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అధికారుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు.

Tags :

Advertisement