Advertisement

  • అమెరికాలో కీల‌క విభాగాలపై సైబ‌ర్ నేర‌గాళ్ల దాడి

అమెరికాలో కీల‌క విభాగాలపై సైబ‌ర్ నేర‌గాళ్ల దాడి

By: chandrasekar Tue, 15 Dec 2020 10:54 AM

అమెరికాలో కీల‌క విభాగాలపై సైబ‌ర్ నేర‌గాళ్ల దాడి


అమెరికాలో కీల‌క విభాగాలపై సైబ‌ర్ నేర‌గాళ్ల దాడి చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ కీలక విభాగాలైన ట్రెజ‌ర‌రీ మరియు వాణిజ్య శాఖకు చెందిన నేష‌న‌ల్ టెలీక‌మ్యూనికేష‌న్స్ అండ్ ఇన్ఫర్మేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగాల‌పై హ్యాక‌ర్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడికి సంబందించిన వివరాలు అందించడానికి అక్కడ అధికారులు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ హ్యాకింగ్ దాడి వెనుక ర‌ష్యా ఉన్న‌ట్లు అమెరిక‌న్ అధికారులు అనుమానిస్తున్నారు.

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ ఫైర్ ఐ హ్యాకింగ్‌ మరియు ప్ర‌స్తుతం హ్యాకింగ్ ఘ‌ట‌న దాడికి సంబంధం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ దాడిపై అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ హ్యాకింగ్ దాడి వ‌ల్ల ఏర్పడే న‌ష్టాన్ని అరికట్టేందుకు అత్య‌వ‌స‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అమెరికా జాతీయ‌సెక్యూరిటీ కౌన్సిల్ ప్ర‌తినిధి జాన్ ఉలియ‌ట్ తెలిపారు. దీనిపై వైట్ హౌస్‌లో స‌మావేశం ఏర్పాటు చేసి చ‌ర్చించాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. కానీ ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందొ ఇప్పుడే కచ్చితంగా నిర్దారించలేదు.

Tags :
|

Advertisement