Advertisement

సైబర్‌నేరగాళ్ల మోసం...లక్షల్లో దోపిడీ

By: chandrasekar Wed, 29 July 2020 12:13 PM

సైబర్‌నేరగాళ్ల మోసం...లక్షల్లో దోపిడీ


సైబర్‌నేరగాళ్లు...పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ కొందరిని, గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ప్రయత్నించిన మరికొందరిని మోసం చేసి లక్షలు కొట్టేసారు. ఆయా ఘటనలకు సంబంధించి బాధితులు మంగళవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

అందులో కొన్ని ప్రధానమైన ఘటనల వివరాలు పోలీసుల కథనం ప్రకారం బోయిన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌చేసి మేము పేటీఎం నుంచి మాట్లాడుతున్నాం అంటూ నమ్మించారు. మీ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని, అందుకు క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. ఆ తరువాత ఆ యాప్‌ కోడ్‌ తీసుకొని, బాధితుడి బ్యాంకు ఖాతాలు, పాస్‌వర్డ్‌ల ఆధారంగా రూ.3 లక్షలు కాజేశారు.

మరో ఘటనలో ఒక లక్ష రూపాయలు కాజేశారు. ఇదిలా ఉండగా ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా తమకు తెలిసిన వారికి గూగుల్‌ పే లో డబ్బులు పంపించారు. ఆ డబ్బులు వారికి చేరలేదు. దీంతో వారిద్దరూ వేర్వేరుగా కస్టమర్‌ కేర్‌ను సంప్రదించేందుకు గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. అందులో గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ నంబర్‌ పేరుతో ఉన్న ఒక నంబర్‌కు ఫోన్‌ చేశారు. తాము గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ మాట్లాడిన సైబర్‌నేరగాళ్లు ఆ ఇద్దరు వ్యక్తులను నమ్మించి వారి ఖాతాల్లో నుంచి వేర్వేరుగా డబ్బులు కాజేశారు.

అమేజాన్‌ కస్టమర్‌ కేర్‌ పేరుతో రూ.80వేలు, గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరుతో మరో ఘటనలో రూ.86వేలు బాధితుల నుంచి సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. అంబర్‌పేట్‌, చిక్కడపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేశారు. ఇద్దరిలో ఒకరు రూ.1.5 లక్షలు, మరొకరు రూ.1.1 లక్షలు చెల్లించారు. అయితే వస్తువులు రాకపోవడంతో ఆర్డర్‌ ఇచ్చిన కంపెనీలకు ఫోన్‌ చేయగా స్వీచాఫ్‌ అని వచ్చింది. ఇదంతా మోసమని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :
|
|

Advertisement