Advertisement

  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే ఇక అంతే ..హెచ్చరించిన సైబరాబాద్ పోలీసులు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే ఇక అంతే ..హెచ్చరించిన సైబరాబాద్ పోలీసులు

By: Sankar Sun, 27 Dec 2020 10:19 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే ఇక అంతే ..హెచ్చరించిన సైబరాబాద్ పోలీసులు


డ్రంక్ డ్రైవ్ వలన కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ..అందుకే పోలీసులు ఎన్నిసార్లు అవగహన కల్పించిన కూడా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు ..అందుకే ఈ సారి హైదరాబాద్ పోలీసులు డ్రంక్అండ్ డ్రైవ్ చేసే వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు...

డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వారి పనిచేసే ఆఫీసులకు సమాచారం అందిస్తామని తెలిపారు. మొదటి సారి పట్టుబడితే రూ.10వేలు ఫైన్‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రెండో సారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది.

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఒక్క డిసెంబర్‌ నెలలోనే 2,351 కేసులు నమోదయ్యాయని, రాచకొండ కమిషనరేట్‌లో ఈ ఏడాది 3,287 కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :
|
|

Advertisement