Advertisement

  • టిక్ టాక్ ప్రో పేరుతో సైబర్ మోసాలు ...జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు

టిక్ టాక్ ప్రో పేరుతో సైబర్ మోసాలు ...జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు

By: Sankar Wed, 08 July 2020 10:38 AM

టిక్ టాక్ ప్రో పేరుతో సైబర్ మోసాలు ...జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు



టిక్ టాక్ ఒక పది రోజుల క్రితం వరకు ఇండియా లో చాలా మంది యువతకు ఊపిరి ..అన్నం , నీళ్లు లేకుండా అయినా బతికారు గాని , టిక్ టాక్ లేకుండా చాల మంది యువత బతకలేకపోయారు ..లాక్ డౌన్ కారణంగా ఎక్కడికి వెళ్లాల్సిన పని కూడా లేకపోవడంతో యువత అది పనిగా టిక్ టాక్ మాయలో పడిపోయారు ..అయితే ఈ టిక్ టాక్ వలన ఉపయోగాలు తక్కువ అనర్ధాలు ఎక్కువ ..అందుకే ఈ టిక్ టాక్ ఎప్పుడు బ్యాన్ చేస్తారా అని ఇండియాలో చాల మంది ఎదురు చూసారు.

అయితే చైనా ఇండియా మధ్య జరిగిన సంఘర్షణల నేపథ్యంలో ప్రజల వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చైనా యాప్స్ ను బ్యాన్ చేసింది ..అందులో ఈ టిక్ టాక్ కూడా ఒకటి ..అయితే టిక్ టాక్ బ్యాన్ చేసారు అని బాధపడుతున్న యువతే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ..

నకిలీ వెబ్‌సైట్‌తో మోసాలకు తెరతీశారు. టిక్‌టాక్‌ ప్రో అనే వెబ్‌సైట్‌ పేరుతో నీలం రంగు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్‌ చేస్తే.. బ్యాంకు ఖాతాలోని డబ్బులు మాయమైనట్టే. ‘ఇప్పుడు టిక్‌టాక్‌ వీడియోల్ని ఆస్వాదించండి. అంతేకాదు సృజనాత్మక వీడియోలు మళ్లీ తయారు చేయండి. మీ టిక్‌టాక్‌ ఇప్పుడు టిక్‌టాక్‌ ప్రోతో వచ్చేసింది’ అంటూ మెసేజ్‌లు పంపించి వల విసురుతున్నారు. ‘ఆహా.. టిక్‌టాక్‌ మళ్లీ వచ్చేసిందే’ అనుకుంటూ లింక్‌ను క్లిక్‌ చేసిన మరుక్షణం మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులు సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతాయని తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు

Tags :
|
|
|
|

Advertisement