Advertisement

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు

By: chandrasekar Thu, 28 May 2020 4:52 PM

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు


సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత తెలివిగా దోచుకుంటున్నారో అంతే తెలివిగా తప్పించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భరత్‌పూర్‌ ముఠా రూటే సపరేటు. ఓఎల్‌ఎక్స్‌లో వచ్చే ప్రకటనల్లో వారు కేవలం వాట్సాప్‌ నంబర్‌లో మాత్రమే సంప్రదించాలని ఇస్తారు. ఎందుకంటే అందులో మాట్లాడితే కాల్‌ రికార్డు కాదని, ట్రాక్‌ చేయలేరని వారి నమ్మకం. అందుకే ఓఎల్‌ఎక్స్‌లో ఇచ్చే ప్రకటనల్లో ‘వాట్సాప్‌' కాల్‌ అని ఉంటే అప్రమత్తమవ్వాలి. తక్కువ ధరకు వస్తువులు ఇస్తామంటే ఆలోచించాలి.

రాజస్థాన్‌‌ సైబర్‌ నేరగాళ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ ఒకరి నుంచి మొదలై దాదాపు 400 మంది యువకులు సైబర్‌ నేరాలకు పాల్పడి లక్షలు దోచుకున్నారు. ఈ పదేండ్లలో దేశ వ్యాప్తంగా రూ. 500 కోట్లు కాజేశారు. వీరు ఇచ్చే ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనల్లో కేవలం వాట్సాప్‌ నంబర్‌లో సంప్రదించాలని ఉంటుంది. ఎవరైనా సంప్రదిస్తే మాయమాటలతో ఖాతా వివరాలు తీసుకుంటారు. బురిడీ కొట్టిస్తారు. మేలుకునేలోపే నిండా ముంచేస్తారు.

cyber,criminals,activities,online,fraud ,సైబర్‌, నేరగాళ్ల, ఆగడాలు, పెరుగుతూనే, ఉన్నాయి


నిందితులను పట్టుకునేందుకు ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు ప్రయత్నించలేదు. కేవలం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధికి చెందిన సైబర్‌ క్రైం పోలీసులు భరత్‌పూర్‌లో అడుగుపెట్టి సుమారు 50 మందిని అరెస్టు చేశారు. అయితే వారి నుంచి ఆశించిన రికవరీ కాలేదు. మోసపోయిన వారికి సొత్తు అందలేదు. అక్కడికి వెళ్లిన మన పోలీసులకు స్థానికులు సహకరించలేదు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయినా అవన్నీ తట్టుకొని నిందితులను పట్టుకోగలిగారు. వాట్సాప్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని ఉంటే సైబర్‌ మోసగాళ్ల వల అని అనుమానించాలి. కాల్‌ చేసినప్పుడు వారు హిందీలో మాట్లాడితే కచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారని గ్రహించాలి. కేవలం చాటింగ్‌ చేస్తే ఆంగ్ల పదాలను పసిగట్టాలి.

cyber,criminals,activities,online,fraud ,సైబర్‌, నేరగాళ్ల, ఆగడాలు, పెరుగుతూనే, ఉన్నాయి


భరత్‌పూర్‌ ముఠా సభ్యులకు ఇంగ్లిష్‌ సరిగా రాదు. రాయలేరు కూడా. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, కేంద్ర బలగాల వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు పెడితే నమ్మొద్దు. ఓఎల్‌ఎక్స్‌ లేదా ఇతర వెబ్‌సైట్‌లలో వస్తువులు మార్కెట్‌ ధర కంటే చాలా తక్కువగా ఇస్తామని ప్రకటనలు ఉంటే అది మోసమని భావించాలి. ముందుగా డబ్బులు వేయమంటే ఆ వస్తువు జోలికి పోవద్దు. మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష ఆన్‌లైన్‌ ఖాతాలో కాజేసిన సొత్తును సైబర్‌ క్రిమినల్స్‌ వివిధ వాలెట్స్‌ల్లో వాడి రికవరీ కాకుండా చేస్తున్నారు. వాట్సాప్‌ కాల్‌ అయినా ఇంటర్‌నెట్‌ కాల్‌ అయినా దానిని ట్రాక్‌ చేసే సత్తా తెలంగాణ పోలీసులకు ఉంది.

Tags :
|
|

Advertisement