Advertisement

  • ఎల్ఐసి డబ్బులు వచ్చాయి ఓటీపీ చెప్పాలి అంటూ డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఎల్ఐసి డబ్బులు వచ్చాయి ఓటీపీ చెప్పాలి అంటూ డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

By: Sankar Fri, 26 June 2020 7:12 PM

ఎల్ఐసి డబ్బులు వచ్చాయి ఓటీపీ చెప్పాలి అంటూ డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు


ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ..స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రజలు ఇలాంటి మోసాలకు ఎక్కువగా గురి అవుతున్నారు ..తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా మక్కినవారి గూడెంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది ..గ్రామానికి చెందిన పరసా మురళి కలప వ్యాపారం చేస్తుం టాడు. ఈ నెల 19న కలప కొనుగోలుకు గట్టుగూడెం వెళ్లాడు.

అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఎల్‌ఐసీ డబ్బులు రూ.20 వేలు వచ్చాయంటూ బ్యాంక్‌ ఖాతా నెంబర్‌ అడిగాడు. మురళి తన భార్య ప్రమీల ఖాతా నెంబర్‌ చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అదేవ్యక్తి తిరిగి ఫోన్‌ చేసి ఓటీపీ నెంబర్‌ అడిగి ఆమె ఖాతా నుంచి రూ.18,800 డ్రా చేశాడు. దీంతో మోసపోయినట్టు గుర్తించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు ..

అయితే దీనిపై పోలీసులు మాట్లాడుతూ ఇలాంటి మోసాలు చాల సాధారణంగా జరుగుతున్నాయి అని ప్రజలు అప్రమొత్తంగా ఉండాలని చూచించారు ..అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ లాంటి వివరాలు అడిగితే చెప్పవద్దు అని , అసలు ఏ కంపెనీ లేదా బ్యాంకు ఎవ్వరు కూడా ఓటీపీ చెప్పమని ఫోన్ చేసి అడగరు అని ఒకవేళ ఆలా ఎవరైనా ఫోన్ చేస్తే అది కచ్చితంగా మోసం చేయడానికే అని పోలీసులు తెలిపారు


Tags :
|
|
|

Advertisement