Advertisement

  • ప్రస్తుతం పోరాడాల్సింది కరోనాతో కాదు కంగనతో...

ప్రస్తుతం పోరాడాల్సింది కరోనాతో కాదు కంగనతో...

By: chandrasekar Wed, 16 Sept 2020 3:43 PM

ప్రస్తుతం పోరాడాల్సింది కరోనాతో కాదు కంగనతో...


బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన మధ్య వివాదం రోజురోజుకీ మరీ దారుణంగా మారిపోతోంది. కంగనను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. పైగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పోరాడాల్సింది కరోనాతో కాదు కంగనతో అంటూ ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. దానికి కొన్ని రోజుల ముందే తన కార్యాలయంపై బిఎంసి అధికారులు దాడి చేసారు. అన్యాయంగా బిల్డింగ్ కట్టారంటూ కూల్చే ప్రయత్నం కూడా చేసారు. అయితే దీనిపై కొందరు కంగనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ హీరోయిన్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని నిజం నిలదీస్తే శివసేన ప్రభుత్వం ఆమెపై కత్తి కట్టిందంటూ కొందరు నెటిజన్లు కూడా కామెంట్ చేసారు.

ఇదిలా ఉంటే కంగన తన కార్యాలయం కూల్చివేతపై కోర్టుకెక్కింది. ఇప్పుడు తనకు జరిగిన నష్టానికి 2 కోట్ల నష్ట పరిహారం కావాలంటూ డిమాండ్ చేసింది కంగన. సెప్టెంబర్ 9న కంగనా కార్యాలయంలోని చాలా భాగాలను బిఎంసి విచ్ఛిన్నం చేసిందని ఇది చట్టవిరుద్ధమని అంటుంది. అక్కడ అంత జరిగిన తర్వాత సెప్టెంబర్ 14న తన స్వస్థలమైన మనాలికి తిరిగి వెళ్ళిపోయింది. శివసేనతో గొడవ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఈమె ఆరోపించింది. సెప్టెంబర్ 9న బాంద్రా బంగ్లాలో కట్టిన కొన్ని అక్రమ నిర్మాణాలను BMC పడగొట్టేసింది. బిఎంసి చర్యపై బొంబాయి హైకోర్టు తర్వాత స్టే ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 22కి వాయిదా పడింది.

Tags :
|

Advertisement