Advertisement

రోడ్డుపై కరెన్సీ నోట్లు - ఎగబడి ఏరుకున్న జనం

By: Dimple Thu, 27 Aug 2020 01:21 AM

రోడ్డుపై కరెన్సీ నోట్లు - ఎగబడి ఏరుకున్న జనం

అనంతపురం జిల్లాలో మరోసారి కరెన్సీ నోట్ల కట్టల కలకలం రేగింది. రాయదుర్గం మండలంలోని జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా కరెన్సీ నోట్లు దొరికినట్లు తెలుస్తోంది. వడ్రవన్నూరు శివారులో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలు పడేసి పారిపోయినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకుని ఎగబడి కరెన్సీ నోట్లు ఏరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 10 లక్షల విలువైన రూ. 500 నోట్లు లభించాయంటున్న స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నోట్ల కట్టల ఘటనపై రాయదుర్గం పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, ఇటీవలే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో కరెన్సీ కట్టలు కలకలం రేపాయి. పోలీసులు ప్రయాణికుల బ్యాగుల్ని తనిఖీ చేసే క్రమంలో గోపాల్ అనే ఓ ప్రయాణికుడి బ్యాగులో రూ. 10 లక్షలు దొరికాయి. ఈ డబ్బును బంగారం కొనుగోలు చేసేందుకు బెంగళూరుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు ప్రయాణికుడు చెప్పాడు. దీంతో విచారణ నిమిత్తం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. ఆధారాలు చూపించడంతో డబ్బును తిరిగి ప్రయాణికుడికి అప్పగించామని పోలీసులు చెప్పారు. అయితే బస్టాండ్‌లో భారీ మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయనే వార్త హాట్‌‌టాపిక్ అయ్యింది.

మొన్నటి వరకు లాక్‌డౌన్, కరోనాతో వ్యాపారాలు ఆగిపోయాయి. దీంతో వ్యాపారులు మళ్లీ యాక్టివ్ అయ్యారు.. ముఖ్యంగా బంగారం వ్యాపారులు తమిళనాడు, బెంగళూరుకు డబ్బులతో వెళుతున్నారు. సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మురం చేశారు. గత నెలలో తమిళనాడులోని సరిహద్దులో భారీగా డబ్బును పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో ఆ డబ్బులు ఏపీ మంత్రి బాలినేనికి సంబంధించినవి అంటూ ప్రచారం జరిగింది.

అయితే మంత్రి కూడా స్పందించి ఆ డబ్బుకు తనకు సంబంధం లేదని చెప్పడం.. ఆ తర్వాత ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి తనకు చెందిన డబ్బుని క్లారిటీ ఇవ్వడం జరిగిపోయాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లాలోని సరిహద్దుల్లో తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. వారు కూడా వ్యాపారానికి సంబంధించిన డబ్బుగా చెప్పారు. అయితే తాజాగా, అనంతపురం జిల్లాలో మాత్రం డబ్బు రోడ్డుపై పడేసి వెళ్లడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఐపీఎల్‌ లో డోపింగ్‌ పరీక్షలు

currency notes,anantapur ,రోడ్డుపై కరెన్సీ నోట్లు - ఎగబడి ఏరుకున్న జనం

దుబాయ్‌లో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్‌, అబుదాబి నగరాలకు చేరుకున్నారు. అందరికీ హోటళ్లలో ప్రత్యేక గదులు కేటాయించారు. ఆరు రోజుల క్వారంటైన్‌ పూర్తయింది. దుబాయ్‌, అబుదాబి, షార్జా క్రికెట్‌ స్టేడియాల్లో విడతలవారీగా ప్రాక్టీస్‌ మ్యాచులను నిర్వహించబోతున్నారు.

క్రికెటర్లపై డోపింగ్‌ పరీక్షల విషయంలో ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వరాదని జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) భావిస్తోంది. అందుకే దుబాయ్‌లో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీలో డోపింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ‘నాడా’ నిర్ణయించింది. ఇందు కోసం శాంపిల్స్‌ను సేకరించేందుకు ‘నాడా’కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు, ఆరుగురు డోప్‌ కంట్రోల్‌ అధికారులు యూఏఈకి వెళ్లనున్నారు.

ఐపీఎల్‌లో కనీసం 50 మంది క్రికెటర్లు శాంపిల్స్‌ తీసుకోవాలని ఈ సంస్థ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ‘నాడాకు చెందిన తొమ్మిది మంది అధికారులు యూఏఈలో ఉంటారు. వారికి యూఏఈ డోపింగ్‌ నిరోధక సంస్థ కూడా సహకరిస్తుంది. మేం సిద్ధం చేసిన బయో బబుల్‌లోనే వారు కూడా ఉంటారు.

దీనికయ్యే మొత్తం ఖర్చును ఎవరు భరిస్తారనేది మాత్రం మేం ఇప్పుడే చెప్పలేం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. పరీక్షల కోసం మూడు మ్యాచ్‌ వేదికలతో పాటు రెండు ప్రాక్టీస్‌ వేదికల వద్ద కలిపి మొత్తం ఐదు డోపింగ్‌ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మరో వైపు కొందరు ఆటగాళ్ల బ్లడ్‌ శాంపిల్స్‌ కూడా తీసుకొని ఖతర్‌లో ‘వాడా’ గుర్తింపు పొందిన కేంద్రంలో పరీక్షించే అవకాశం కూడా ఉంది.

Tags :

Advertisement