Advertisement

  • కీలక పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ దిగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కీలక పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ దిగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్

By: Sankar Sun, 01 Nov 2020 3:28 PM

కీలక పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ దిగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్


కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 22సార్లు ముఖాముఖి పోరులో తలపడితే అందులో సీఎస్‌కే 13సార్లు విజయం సాధించగా, పంజాబ్‌ 9సార్లు గెలుపొందింది.

ఇక ఇప్పటికే సీఎస్‌కే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్ర్కమించగా, కింగ్స్‌ పంజాబ్‌ ఇంకా రేసులోనే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కింగ్స్‌ పంజాబ్‌ తన ప్లేఆఫ్స్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. సీఎస్‌కేపై గెలిచినా మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఇంకా మూడు ప్లేఆఫ్స్‌ స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. అందులో నాల్గో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. దాంతో పంజాబ్‌ కనీసం నాల్గో స్థానంలో ఉండాలంటే ధోని సేనపై భారీ విజయం సాధించాలి..

ఇక షేన్‌ వాట్సన్‌, సాంట్నర్‌, కర్ణ్‌ శర్మ స్థానంలో డుప్లెసిస్‌, తాహిర్‌, శార్దుల్‌ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు. వరుసగా విఫలమవుతున్న మాక్స్‌వెల్‌ స్థానంలో జేమ్స్‌ నీషమ్‌, అర్షదీప్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ వివరించాడు.

Tags :
|
|
|

Advertisement