Advertisement

  • SRH ‌పై CSK విజయం...ఎట్టకేలకు ప్లే ఆఫ్ రేసులో నిలిచిన ధోని సేన

SRH ‌పై CSK విజయం...ఎట్టకేలకు ప్లే ఆఫ్ రేసులో నిలిచిన ధోని సేన

By: chandrasekar Wed, 14 Oct 2020 11:44 AM

SRH ‌పై CSK విజయం...ఎట్టకేలకు ప్లే ఆఫ్ రేసులో నిలిచిన ధోని సేన


దుబాయ్: ఐపీఎల్ 13వ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. మరోసారి అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్‌లో ఎట్టకేలకు ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. దుబాయ్ వేదికగా మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ధోని సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ ( 38 బంతుల్లో 42; 1 ఫోర్‌, 3 సిక్సర్లు), అంబటి రాయుడు (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో దిగిన సన్‌రైజర్స్‌ బ్యాటింగ్ వైఫల్యంతో మరోసారి ఓటమిపాలైంది. హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్‌ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు) బెయిర్ స్టో (24 బంతుల్లో 23; 2 ఫోర్లు) కొట్టారు. అయితే చెన్నై బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ధోని సేన అద్భుతమైన ఫిల్డింగ్, బౌలింగ్‌తోపాటు హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడంతో ఘోర పరాజయం పాలైంది. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రావో(2/25), కర్ణ్‌ శర్మ (2/37) సన్‌రైజర్స్‌ను చిత్తు చేశారు. అయితే ఆల్‌రౌండ్ షో తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ధోని సేన కూడా అంతగా బ్యాటింగ్ రాణించలేకపోయింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. షేన్‌ వాట్సన్‌ (42), అంబటి రాయుడు (41), శామ్‌ కరన్ ‌(31: 21 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), మహేంద్ర సింగ్‌ ధోనీ (21: 13 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌), జడేజా (25 నాటౌట్:10 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) రాణించారు. ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో రాణించి ధోని సేన.. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ రేసులో నిలిచి అభిమానుల ఆకట్టుకుంది.

ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శామ్‌ కరన్‌ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ (9)‌, మనీశ్‌ పాండే (4) అవుటై వెనుదిరిగారు. 27 పరుగులకే సన్‌రైజర్స్‌ 2 వికెట్లు కోల్పోయి.. ఒత్తిడిలో కురుకున్న సమయంలో క్రీజులో ఉన్న విలియమ్సన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ అద్భుతంగా ఆడాడు. విలియమ్సన్‌, బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న క్రమంలో జడ్డూ వేసిన 10వ ఓవర్లో బెయిర్‌స్టో బౌల్డ్‌ అయ్యాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేన్.. కర్ణ్‌ శర్మ వేసిన ఓవర్‌‌లో ఔటయ్యాడు. చివరి ఓవర్లలో రషీద్‌ ఖాన్‌ (14), షాబాజ్‌ నదీమ్‌ (5) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

Tags :
|

Advertisement