Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ..పూర్తి ఫిట్ నెస్ లేని కారణంగా రాయుడు అవుట్

చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ..పూర్తి ఫిట్ నెస్ లేని కారణంగా రాయుడు అవుట్

By: Sankar Tue, 22 Sept 2020 7:26 PM

చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ..పూర్తి ఫిట్ నెస్ లేని కారణంగా రాయుడు అవుట్


ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇది ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు తొలి మ్యాచ్‌. కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే మ్యాచ్‌ గెలిచి మంచి ఊపు మీద ఉంది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో సీఎస్‌కే శుభారంభం చేసి జోష్‌ మీద ఉంది. తాజాగా రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నైనే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ గత మ్యాచ్‌ను గెలిపించిన అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం లేదు. పూర్తిఫిట్‌నెస్‌తో లేని కారణంగా రాయుడ్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. రాయుడి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా బట్లర్ , స్టోక్స్ వంటి కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది..ఉతప్ప , మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరారు..ఇక యశస్వి జైస్వాల్ వంటి యంగ్ ఆటగాడు ఎలా ఆడతాడు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు..ఇక ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ 22 మ్యాచ్‌లు జరగ్గా 14 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయం సాధించింది. ఇక మరో ఎనిమిది మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ గెలుపును అందుకుంది

Tags :
|
|

Advertisement