Advertisement

ఆరంభ మ్యాచుకు చెన్నై దూరం

By: Dimple Sat, 29 Aug 2020 11:58 PM

ఆరంభ మ్యాచుకు చెన్నై దూరం

ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమ్యాచులో... డిపెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌... రన్నరఫ్‌ చెన్నైసూపర్ కింగ్స్‌ జట్లమధ్య పోటీ జరగాల్సి ఉంది. అయితే... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిబంధనలతో అబుదాబి - దుబాయ్‌ నగరాలమధ్య రాకపోకలకు ప్రతిబంధకంగా తయారయ్యాయి. ప్రొటోకాల్‌ సమస్యను పరిష్కరించుకునే మార్గం లభించిన తర్వాత... చెన్నై జట్టును కరోనా కలవర పరచింది. దీంతో ఐపీఎల్‌ షెడ్యూలులో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏసందర్భంలో తొలి సారిగా ఐపీఎల్‌ షెడ్యూలు రూపొందించారోగానీ... అడుగడుగునా... ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.

షెడ్యూలు మార్చే పనిలో బీసీసీఐ తలమునకలైంది. ఆటగాళ్లు మాత్రం... అవాంతరాలు అధిగమించి సాఫీగా సాధన చేస్తున్నారు.
క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)- ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య తొలి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్‌ ఆడేందుకు సీఎస్‌కే ఇంకా సన్నద్ధం కాలేదు. ఆటగాళ్లతో పాటు టీం సిబ్బంది కూడా కరోనా వైరస్‌ బారినపడటం ఆందోళనకరంగా మారింది. అందరి కంటే ముందే దుబాయ్‌కు చెక్కేసిన ధోనీ సేన కరోనా కారణంగా ఇంకా క్వారెంటైన్‌లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 10 మంది సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. ఈ ప్రభావం లీగ్‌ ఆరంభ మ్యాచ్‌పై పడే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో బోర్డు సీనియర్‌ అధికారి సమాచారం ప్రకారం.. షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా లీగ్‌ను కొంత ఆసల్యంగా ప్రారంభించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనుకున్న దానికంటే ఆటగాళ్లపై ఆరంభంలోనే కరోనా ప్రభావం చూపడంతో అసలు లీగ్‌ సాధ్యమవుతుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్ల క్వారెంటైన్‌ ముగించుకుని ప్రాక్టీస్‌ ఆరంభించినా.. వైరస్‌ ఎటు నుంచి దాడి చేస్తోందనే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :
|

Advertisement