Advertisement

  • ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడం కష్టమే... సునీల్ గవాస్కర్

ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడం కష్టమే... సునీల్ గవాస్కర్

By: Sankar Thu, 17 Sept 2020 3:41 PM

ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడం కష్టమే... సునీల్ గవాస్కర్


మరొక రెండు రోజుల్లో ఐపీయల్ పదమూడవ సీజన్ ప్రారంభం కానుండగా భారత మాజీ ఆటగాడు.. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాత్రం ఐపీఎల్‌ 2020 టైటిల్‌ను చెన్నైసూపర్‌ కింగ్స్‌ గెలవడం కష్టమేనంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పిన ధోనికి మాత్రం ఈ ఐపీఎల్‌ లాభదాయకంగా మారుతుందని.. ఎందుకంటే అతనిపై ఒత్తిడి అంతగా ఉండకపోవడమే కారణమని తెలిపాడు. స్పోర్ట్స్‌టాక్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సునీల్‌ గవాస్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు..

సురేశ్‌ రైనా, హర్బజన్‌ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన చెన్నై జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో ఎంతమేరకు రాణిస్తుందనేది చూడాలి. ఎందుకంటే జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు ఉంటేనే సమతూకంగా ఉంటుందని.. కానీ చెన్నైలో ప్రస్తుతం అది మిస్సయింది. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడం కొంచెం కష్టంగా మారింది.

అయితే జట్టులో సీనియర్‌ ఆటగాడిగా.. కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్‌ ధోనికి మాత్రం ఐపీఎల్‌ లాభదాయకంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ధోనికి ఒత్తిడి లేకపోవడం దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంది. ఒక కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపిస్తాడనంలో సందేహం లేదు. అయితే యువ ఆటగాళ్లు ఎంతమేర సహకరిస్తారనేది చూడాలి.' అంటూ తెలిపాడు.కాగా చెన్నై జట్టు ముంబై ఇండియన్స్‌తో సెప్టెంబర్‌ 19న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది


Tags :
|
|
|
|
|

Advertisement