Advertisement

  • కేదార్ జాదవ్ పై విరుచుకుపడుతున్న చెన్నై ఫాన్స్ ..ఎందుకో తెలుసా !

కేదార్ జాదవ్ పై విరుచుకుపడుతున్న చెన్నై ఫాన్స్ ..ఎందుకో తెలుసా !

By: Sankar Thu, 08 Oct 2020 4:48 PM

కేదార్ జాదవ్ పై విరుచుకుపడుతున్న చెన్నై ఫాన్స్ ..ఎందుకో తెలుసా !

ఐపీఎల్ 2020 సీజన్‌లో పేలవ బ్యాటింగ్ కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో బుధవారం రాత్రి 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. మరీ ముఖ్యంగా.. స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చిన కేదార్ జాదవ్ (7 నాటౌట్: 12 బంతుల్లో 1x4) జిడ్డు బ్యాటింగ్‌ చెన్నై టీమ్‌ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైంది. దాంతో.. నెటిజన్లు అతడ్ని ఉతికారేస్తున్నారు.

168 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై విజయానికి చివరి 21 బంతుల్లో 39 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్.. పరుగుల ఖాతా తెరిచేందుకు ఆరు బంతులు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆడిన తొలి మూడు బంతుల్నీ డిఫెన్స్‌తో సరిపెట్టిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆ తర్వాత.. రసెల్ ఓవర్‌లో బంతిని టచ్ చేసేందుకు కూడా ఆపసోపాలు పడ్డాడు.

సమీకరణం 12 బంతుల్లో 36 పరుగులుగా మారిపోగా.. చివరి రెండు ఓవర్లలోనూ ఆరు బంతులు ఎదుర్కొని కేదార్ చేసింది ఆరు పరుగులే. దాంతో.. రవీంద్ర జడేజా (21 నాటౌట్: 8 బంతుల్లో 3x4, 1x6) ఆఖర్లో హిట్టింగ్ చేసినా ప్రయోజనం లేకపోయింది.

Tags :
|
|
|

Advertisement