Advertisement

CSK ఒక్క తప్పుతో అంతా మారిపోయింది: లారా

By: chandrasekar Thu, 29 Oct 2020 7:27 PM

CSK ఒక్క తప్పుతో అంతా మారిపోయింది: లారా


ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తోంది. గత పది సీజన్లలో.. మూడుసార్లు టైటిల్ గెలిచి.. ఐదుసార్లు ఫైనల్ చేరిన ధోనీసేన.. ఈసారి మాత్రం లీగ్ దశ దాటి ముందుకెళ్లడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఇలా ఆడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. డ్యాడీస్ ఆర్మీ అంటూ అందరూ హేళన చేసినా.. 2018లో ఛాంపియన్లుగా నిలిచిన సీఎస్‌కే.. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. కానీ ఈ సీజన్లో అనూహ్యంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వయసు మీద పడిన ఆటగాళ్లను నమ్ముకొని దెబ్బతిందని దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు. చెన్నై జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ మంది లేరన్న విషయాన్ని లారా గుర్తు చేశాడు.

యువకుల కంటే ఎక్కువగా అనుభవం ఉన్న ఆటగాళ్లపై సీఎస్‌కే నమ్మకం ఉంచడంతో అంతా తలకిందులైందని లారా అభిప్రాయపడ్డాడు. ‘‘3-4 మ్యాచ్‌ల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి విజయాల బాట పడుతుందనే ఆశ మొలకెత్తింది. ధోనీ అంతా మార్చేస్తాడని భావించారంతా. కానీ మ్యాచ్ తర్వాత మ్యాచ్.. ఆశలు నిరాశలైయ్యాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే సీజన్‌కు జట్టును బలోపేతం చేయడమే వారు చేయగలిగేది. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల్లో చెన్నై ఏం చేస్తుందో చూడాలి’’ ఈ కరేబియన్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై స్టన్నింగ్ విక్టరీ సాధించిన ధోనీ సేన.. నేటి సాయంత్రం (గురువారం) కోల్‌కతాతో ఢీ కొంటోంది.

Tags :
|

Advertisement