Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ ఐపీయల్ వేలంలో పీయూష్ చావ్లాను తీసుకోవడంలో ధోని పాత్ర ..

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీయల్ వేలంలో పీయూష్ చావ్లాను తీసుకోవడంలో ధోని పాత్ర ..

By: Sankar Mon, 13 July 2020 7:41 PM

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీయల్ వేలంలో పీయూష్ చావ్లాను తీసుకోవడంలో ధోని పాత్ర ..



ఐపీఎల్ 2020 సీజన్‌ ఆటగాళ్ల వేలంలో స్పిన్నర్ పీయూస్ చావ్లాని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఏకంగా రూ.6.75 కోట్లకి కొనుగోలు చేయడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ జట్టులో హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర్ రూపంలో అగ్రశ్రేణి స్పిన్నర్లు ఉన్నా.. చావ్లా కోసం ఎందుకు అంత పెద్ద మొత్తంలో చెన్నై ఫ్రాంఛైజీ వెచ్చించిందో..? ఎవరికీ అర్థం కాలేదు. కానీ.. ఆ ఎంపిక వెనుక ధోనీ ఉన్నట్లు తాజాగా పీయూస్ చావ్లా స్వయంగా వెల్లడించాడు.

స్పోర్ట్స్‌క్రీడా వెబ్‌సైట్‌కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూస్ చావ్లా మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది ఐపీఎల్‌‌ ముంగిట చెన్నైలో టీమ్ క్యాంప్ జరిగింది. ఆ సమయంలో కెప్టెన్ ధోనీతో క్రికెట్ గురించి కాసేపు చర్చించాను. అప్పుడు చెన్నై జట్టులోకి నన్ను ఎందుకు తీసుకున్నారు..? అని ధోనీ ప్రశ్నించాను. దాంతో.. నిన్ను వేలంలో తీసుకోమని ఫ్రాంఛైజీకి నేనే చెప్పా అని ధోనీ వెల్లడించాడు’’ అని చావ్లా గుర్తు చేసుకున్నాడు.

వాస్తవానికి 2018 ఐపీఎల్ సీజన్‌ వేలంలోనే పీయూస్ చావ్లా కోసం చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నించింది. అన్ని ఫ్రాంఛైజీలతో పోటీపడి రూ. 4.2 కోట్లకి వేలం పాడింది. కానీ.. ఆఖరి నిమిషంలో ‘రైట్ టు మ్యాచ్‌’‌ని ప్రయోగించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అదే ధరకి మళ్లీ అట్టిపెట్టుకుంది. కాగా ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 157 మ్యాచ్‌లాడిన పీయూస్ చావ్లా 150 వికెట్లు పడగొట్టాడు.

Tags :
|
|
|

Advertisement