Advertisement

  • ఆత్మనిర్బర్‌ అభియాన్ పై పూచీకత్తు లేని రుణాలకు కలెక్టర్లు కృషిచెయలన్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్

ఆత్మనిర్బర్‌ అభియాన్ పై పూచీకత్తు లేని రుణాలకు కలెక్టర్లు కృషిచెయలన్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్

By: chandrasekar Fri, 07 Aug 2020 3:54 PM

ఆత్మనిర్బర్‌ అభియాన్ పై పూచీకత్తు లేని రుణాలకు కలెక్టర్లు కృషిచెయలన్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్


ప్రధాని మోడీ గారు ప్రకటించిన ఆత్మనిర్బర్‌ అభియాన్‌ ప్యాకేజీపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్యాకేజీపై ఉన్నతాధికారులు, కలెక్టర్లు, బ్యాంకర్లతో సీఎస్‌ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ పరిశ్రమలకు పూచీకత్తు లేని రుణాలకు కలెక్టర్లు కృషి చేయాలన్నారు. దీనిద్వారా అనేకమందికి జీవనోపాధి కలుగుతుందని వివారించారు.

పరిశ్రమలకు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ కింద పూచీకత్తు లేని రుణాలు అందజేయాలన్నారు. ఎక్కువ మందికి లబ్ది చేకూర్చేలా కలెక్టర్లు తరచూ సమీక్షించాలని సూచించారు. పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్లు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు.

రుణాలకు పరిమితి లేనందున పరిశ్రమలకు అధిక రుణాలపై దృష్టిపెట్టాలన్నారు. పథకం కింద అర్హత ఉన్న పరిశ్రమల జాబితాను బ్యాంకర్లు అందించాలని తెలిపారు. బ్యాంకర్లు తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు అందించాలని సీఎస్‌ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొత్త పరిశ్రమలు స్థాపించడంతోబాటు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.

Tags :
|

Advertisement