Advertisement

డెసర్ట్ లో పంటలు

By: chandrasekar Wed, 27 May 2020 3:40 PM

డెసర్ట్ లో పంటలు


రోజురోజుకు భూతాపం పెరుగుతున్నది. వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. అశాస్త్రీయ విధానాల్లో సాగు, కృత్రిమ ఎరువుల వాడకం వల్ల నేలలు సారం కోల్పోతున్నాయి. కరువుకాటకాల వల్ల ఎన్నో భూములు ఎడారులుగా మారుతున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే భూమి విస్తీర్ణంలో 40% ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. దీనికి తోడు జనాభా పెరుగుతున్నది. ఆహార కొరత ఏర్పడుతున్నది.

ఎడారి దేశం దుబాయ్‌ ఆర్థికంగా వృద్ధి చెందినప్పటికీ ఆహార అవసరాల్లో 90% దిగుమతులపైనే ఆధారపడుతున్నది. ఇలాంటి పరిస్థితులను అధిగమించి, ఆహార స్వయంసమృద్ధి సాధించేందుకు, ఎడారీకరణను నిరోధించేందుకు నార్వేకు చెందిన ‘డెజర్ట్‌ కంట్రోల్‌' సంస్థ సరికొత్త విధానంతో ముందుకు వచ్చింది. ‘లిక్విడ్‌ నానో క్లే(ఎల్‌ఎన్‌సీ)’గా పిలిచే ఈ విధానం ద్వారా ఎడారిలో కూడా మొక్కలు మొలిపిస్తున్నది. పంటలు పండిస్తున్నది. ఇసుక నేలలపై చెట్లతో పచ్చని తివాచీలను పరుస్తున్నది.

crops,dessert,land,farming,water ,డెసర్ట్ లో, పంటలు, భూమి, విస్తీర్ణంలో, పరిస్థితులు


ఎడారి నేలపై పర్చిన 7 గంటల్లోనే ప్రభావం చూపిస్తుంది. 60 సెంటీమీటర్ల లోతు వరకు నేలను ఒక స్పాంజిలాగా మార్చుతుంది. పోషకాలను పట్టి ఉంచుతుంది. నీటిని నిల్వ చేసుకొనే గుణాన్ని కలిగిస్తుంది. నీటి లవణీయతను తగ్గించి నేల సారాన్ని పెంచుతుంది. చౌడు నేలలపై ఈ విధానాన్ని అమలు చేస్తే క్రమంగా అందులోని లవణీయత తగ్గి పంటలకు అనుకూలంగా మారుతాయి. ఎల్‌ఎన్‌సీ కోటింగ్‌ చేసిన నేల సాధారణం కంటే 65% తక్కువ నీటిని వినియోగించుకొంటుంది. ప్రకృతిసిద్ధంగా నేల ఇలా మారాలంటే 15 ఏండ్ల సమయం పడుతుందని డిజెర్ట్‌ కంట్రోల్‌ ప్రతినిధులు చెప్తున్నారు.

crops,dessert,land,farming,water ,డెసర్ట్ లో, పంటలు, భూమి, విస్తీర్ణంలో, పరిస్థితులు


ఎల్‌ఎన్‌సీ కోటింగ్‌ ప్రక్రియ ద్వారా ఇప్పటికే దుబాయ్‌లో పంటలు పండిస్తున్నారు. అక్కడి రైతు ఫైసల్‌ ఈ ప్రక్రియపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతకుముందు కంటే సగం నీటితోనే పంటలు పండిస్తున్నానని చెప్పాడు. ఎల్‌ఎన్‌సీతో పంటలు పండించడానికి భారత్‌లోని నేలలపైన కూడా పరిశోధనలు చేయాలని భావిస్తున్నట్లు క్రిస్టియాన్‌ తెలిపారు. ఎడారిగా మారిన నేలల్లో తిరిగి పచ్చదనం తీసుకురావడమే సంస్థ ఉద్దేశమని చెప్పారు.

ఎల్‌ఎన్‌సీ అంటే నీళ్లు, సన్నని మట్టి కలిపి తయారు చేసిన ముద్ద. ఈ ప్రక్రియలో సారవంతమైన మట్టిని చిన్న రేణువులుగా చేస్తారు. దానికి ప్రకృతి సిద్ధమైన కొన్ని రసాయనాలు, నీటిని కలిపి ముద్దగా చేస్తారు. ఆ తర్వాత సన్నని పొరగా నేలపై పరుస్తారు. దీనిని ఎక్కడైనా తయారు చేయవచ్చు. ఇళ్లపై స్లాబ్‌ వేసేప్పుడు కాంక్రీట్‌ కలిపినట్టుగానే, చెట్లు పెంచాలనుకున్న దగ్గర ఎల్‌ఎన్‌సీని తయారు చేయవచ్చు. ఒక మీటరు స్థలానికి రెండు కిలోల ఎల్‌ఎన్‌సీ సరిపోతుందని డిజెర్ట్‌ కంట్రోల్‌ సీఈవో క్రిస్టియాన్‌ తెలిపారు.

Tags :
|
|

Advertisement