Advertisement

  • ట్రంప్ ఫోటోషూట్ స్ట‌యిల్‌లో హాస్పిట‌ల్ బ‌య‌ట తిర‌గ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు

ట్రంప్ ఫోటోషూట్ స్ట‌యిల్‌లో హాస్పిట‌ల్ బ‌య‌ట తిర‌గ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు

By: chandrasekar Tue, 06 Oct 2020 5:46 PM

ట్రంప్ ఫోటోషూట్ స్ట‌యిల్‌లో హాస్పిట‌ల్ బ‌య‌ట తిర‌గ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు


అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌స్తుతం వాల్ట‌ర్ రీడ్ నేష‌న‌ల్ మిలిట‌రీ హాస్పిట‌ల్‌లో కరోనా చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం స్వ‌ల్ప కరోనా ల‌క్ష‌ణాల‌తో హాస్పిట‌ల్‌లో చేరిన ఆయ‌న ఆదివారం త‌న అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. హాస్పిట‌ల్ బ‌య‌ట వేచి చూస్తున్న త‌న మ‌ద్ద‌తుదారుల‌ను ప‌ల‌క‌రించేందుకు ఓ యూఎస్‌యూవీ కారులో బ‌య‌ట‌కు వెళ్లారు. మాస్క్ ధ‌రించిన ట్రంప్ త‌న అభిమానుల్ని కారులో నుంచి సంకేతాల‌తో ప‌లుక‌రించారు. అయితే కరోనా ల‌క్ష‌ణాల‌తో ట్రంప్ కారులో బ‌య‌ట‌కు వెళ్ల‌డం ప‌ట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

అలా చేయ‌డం వ‌ల్ల ఆయ‌న సిబ్బందికి ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వ్యాధి తీవ్ర‌మైనదే అయినా ట్రంప్ మాత్రం ఫోటోషూట్ స్ట‌యిల్‌లో హాస్పిట‌ల్ బ‌య‌ట తిర‌గ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ఆదివారం ట్రంప్‌కు ఇచ్చిన చికిత్స‌కు సంబంధించి డాక్ట‌ర్లు కొన్ని విష‌యాల‌ను తెలిపారు. ట్రంప్ ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిన‌ట్లు డాక్ట‌ర్లు హెచ్చ‌రించారు. రెండుసార్లు ఆయ‌న‌కు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గాయి. స్టెరాయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చిన‌ట్లు డాక్ట‌ర్లు చెబుతున్నారు. వారం చివ‌ర్లో కొద్దిగా ఆక్సిజ‌న్ అందించిన‌ట్లు వైట్‌హౌజ్ వ‌ర్గాలు ప్రకటించాయి. ఇక సీరియ‌స్ పేషెంట్ల‌కు ఇచ్చే డెక్సామిథాసోన్ మందును కూడా ట్రంప్‌కు ఇచ్చిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. హాస్పిట‌ల్‌లో ఉన్న ట్రంప్ ఓ ట్వీట్ లో కరోనా గురించి ఎంతో నేర్చుకున్న‌ట్లు తెలిపారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని, దీని గురించి మీకు పూర్తిగా తెలియ‌జేస్తాన‌ని అన్నారు.

Tags :
|

Advertisement