Advertisement

  • క్రిస్టియానో రోనాల్డో కాతాలో మరొక రికార్డు ..అంతర్జాతీయ స్థాయిలో 100 గోల్స్ చేసిన రెండో ఆటగాడు

క్రిస్టియానో రోనాల్డో కాతాలో మరొక రికార్డు ..అంతర్జాతీయ స్థాయిలో 100 గోల్స్ చేసిన రెండో ఆటగాడు

By: Sankar Thu, 10 Sept 2020 09:27 AM

క్రిస్టియానో రోనాల్డో కాతాలో మరొక రికార్డు ..అంతర్జాతీయ స్థాయిలో 100  గోల్స్ చేసిన రెండో ఆటగాడు


దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో ..ఈ పేరు తెలియని ఫుట్ బాల్ ప్రేమికులు ఉండరు..గత పదిహేను ఏళ్లుగా ప్రపంచ ఫుట్ బాల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రోనాల్డో కాతాలో లెక్కలేనన్ని రికార్డులు , అవార్డులు ..అయితే తాజాగా రోనాల్డో ఒక అద్భుతమైన రికార్డు సాధించాడు..అంతర్జాతీయస్థాయిలో 100 గోల్స్‌ పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి యూరప్‌ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ (యూఈఎఫ్‌ఏ) నేషన్స్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్‌ ‘3’ లీగ్‌ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 2–0 గోల్స్‌ తేడాతో స్వీడన్‌ను ఓడించింది. 35 ఏళ్ల రొనాల్డో ఆట 45వ నిమిషంలో గోల్‌ చేయడంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో 100వ గోల్‌ మైలురాయి చేరుకున్నాడు.

ఆ తర్వాత 73వ నిమిషంలో రొనాల్డో రెండో గోల్‌ కూడా చేసి తమ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గోల్‌తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్‌ సంఖ్య 101కు చేరింది. అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు అలీ దాయి (ఇరాన్‌) పేరిట ఉంది. 2006లో రిటైరైన 51 ఏళ్ల అలీ దాయి ఇరాన్‌ తరఫున మొత్తం 109 గోల్స్‌ సాధించాడు.

Tags :

Advertisement