Advertisement

  • మోచేతుల్ని తాకించి అభినందించుకున్న క్రికెటర్స్

మోచేతుల్ని తాకించి అభినందించుకున్న క్రికెటర్స్

By: chandrasekar Fri, 03 July 2020 3:38 PM

మోచేతుల్ని తాకించి అభినందించుకున్న క్రికెటర్స్


కరోనా కారణంగా మూడు నెలలపాటు నిలిచిపోయిన క్రికెట్‌ సందడి మళ్లీ మొదలైంది. ఇంగ్లాండ్‌ క్రికెటర్లు రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. సౌతాంప్టన్‌ వేదికగా జూలై 8 నుంచి బెన్‌స్టోక్స్‌ సారథ్యంలోని ఇంగ్లాండ్ వెస్టిండీస్‌తో తలపడనుంది.

ఈ నేపథ్యంలో టీమ్‌ స్టోక్స్‌, టీమ్‌ బట్లర్‌ జట్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాల్గొన్నాయి. సన్నాహాక మ్యాచ్‌లో భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. సాధారణంగా క్రికెట్లో బౌలర్‌ వికెట్‌ తీయగానే ఫీల్డర్లు అతణ్ని చుట్టుముట్టి కరచాలనం చేయడం, హగ్‌ చేసుకోవడం చేస్తుంటారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వికెట్లు తీసిన తర్వాత ఆటగాళ్లు మోచేతుల్ని తాకించుకుంటూ అభినందించుకున్నారు.

గాయం నుంచి కోలుకొని చాలా రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ వికెట్‌ తీసిన ఆనందంలో సహచర ఆటగాళ్లతో మోచేతుల్ని తాకించి సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. కరోనా ముందు జాగ్రత్త చర్యగా బౌండరీ ఆవల శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రాక్టీస్‌ గేమ్‌లో టీమ్‌ స్టోక్స్‌కు ఆండర్సన్‌ ఆడుతున్నాడు.

Tags :

Advertisement