Advertisement

ఉన్నతాధికారులుగా క్రికెటర్స్ ...

By: chandrasekar Mon, 16 Nov 2020 11:05 AM

ఉన్నతాధికారులుగా క్రికెటర్స్ ...


బీసీసీఐ..భారత క్రికెట్ లో విశిష్టమైన సేవలందించే పలువురు క్రికెటర్లకు ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఉద్యోగం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్ జట్టులో పలువురి ఆటగాళ్లు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కపిల్ దేవ్ తర్వాత ఆర్మీలో లెఫ్ట్నెంట్ కల్నల్ హోదా పొందిన మరో క్రికెటర్ ఎంఎస్ ధోని. 2011 లో ఆయన ఈ హోదా పొందాడు. మిగతావారిలా కాకుండా ధోని తన బాధ్యతల్ని చాలా సీరియస్ గా నిర్వర్తిస్తాడు. గతేడాది వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన కొద్దిరోజుల పాటు ఆర్మీలో పనిచేసిన విషయం విదితమే. ఇండియన్ క్రికెట్ టీం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్. బ్యాంకులతో యువకులకు మంచి సంబంధాలు కలిగించేందుకు ఆర్బీఐ రాహుల్ ను 2018లో ఈ జాబ్ లో నియమించింది.

2007 టీ20 ఫైనల్ లో పాక్ పై భారత చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్ శర్మ హర్యానాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 2007 అక్టోబర్ లో ఆయనకు ఈ ఉద్యోగం ఇచ్చారు. కపిల్ దేవ్.. భారత క్రికెట్ కు తొలి ప్రపంచకప్ ను అందంచిన ఈ హర్యానా హరికేన్ పేరిట చాలా రికార్డులున్నాయి. భారత క్రికెట్ కు ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాతో గౌరవించింది. ఈ హోదా పొందిన తొలి క్రికెటర్ కపిల్ కావడం గమనార్హం. ఉమేశ్ యాదవ్..ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్. స్పోర్ట్స్ కోటా కింద ఉమేశ్ కు 2017లో ఈ జాబ్ వచ్చింది. భారత మిస్టరీ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ ఆదాయపు పన్నుల శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. 2018 లో అతడికి ఈ ఉద్యోగం ఇచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కు చేసిన సేవలు నిరూపమానం. సచిన్ సేవలకు గానూ భారత వాయుసేన ఆయనకు అత్యున్నత పదవిని ఇచ్చి గౌరవించింది. 2010 లో సచిన్ ను గ్రూప్ కెప్టెన్ గా నియమించింది.

Tags :
|
|

Advertisement