Advertisement

  • నీ హెలికాప్టర్ షాట్స్ మిస్ అవుతాము ..ధోని రిటైర్మెంట్ పై ప్రముఖుల స్పందనలు

నీ హెలికాప్టర్ షాట్స్ మిస్ అవుతాము ..ధోని రిటైర్మెంట్ పై ప్రముఖుల స్పందనలు

By: Sankar Sun, 16 Aug 2020 06:50 AM

నీ హెలికాప్టర్ షాట్స్ మిస్ అవుతాము ..ధోని రిటైర్మెంట్ పై ప్రముఖుల స్పందనలు


మిస్టర్ కూల్ , దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులతో పాటు సహచర , మాజీ ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు..ఇండియన్ క్రికెట్ చరిత్రలో సచిన్ తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించిన ధోని , ఒక సాధారణ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను నిరాశకు గురి చేసింది..అయితే ప్రముఖులు ధోని రిటైర్మెంట్ పై ఎలా స్పందించారో ఇప్పుడు చూదాం

‘భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. నీతో కలిసి 2011 వరల్డ్‌ కప్‌ సాధించిన నా జీవితంలో మధుర ఘట్టం. నీ రెండో ఇన్నింగ్స్‌ బాగా సాగాలని కోరుకుంటున్నా’
– సచిన్‌ టెండూల్కర్‌

‘ప్రతీ క్రికెటర్‌ ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగించాల్సిందే. అయితే నీకు అత్యంత ఆత్మీయులు అలా చేసినప్పుడు భావోద్వేగాలు సహజం. నీవు దేశానికి చేసింది ప్రతీ ఒక్కరి మదిలో గుర్తుండిపోతుంది. కానీ మన మధ్య పరస్పర గౌరవం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను’ –విరాట్‌ కోహ్లి

‘భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ప్రపంచ క్రికెట్‌లో అతనో అద్భుతమైన ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని నాయకత్వ లక్షణాలకు మరెవరూ సాటి రారు. వన్డేల్లో అతని బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే’ – సౌరవ్‌ గంగూలీ

‘ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ధోని కెరీర్‌ ముగిస్తున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ సహచరుడిగా నీలాంటి ప్రొఫెషనల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ధోనికి సెల్యూట్‌’ –రవిశాస్త్రి

‘ధోని లాంటి ఆటగాడు రావడం అంటే మిషన్‌ ఇంపాజిబుల్‌. ఎమ్మెస్‌ లాంటి వాడు గతంలోనూ, ఇప్పుడూ లేరు. ఇంకెప్పుడూ రారు. ఆటగాళ్లంతా వచ్చి పోతుంటారు కానీ అతనంత ప్రశాంతంగా ఎవరూ కనిపించరు. ఎందరో క్రికెట్‌ అభిమానుల కుటుంబ సభ్యుడిగా ధోని మారిపోయాడు. ఓం ఫినిషాయనమ’ –వీరేంద్ర సెహ్వాగ్‌

‘గొప్ప కెరీర్‌ను ముగించినందుకు ధోనికి నా అభినందనలు. నీతో కలిసి ఆడటం నాకూ గౌరవకారణం. నాయకుడిగా నీ ప్రశాంత శైలితో అందించిన విజయాలు ఎప్పటికీ మధురానుభూతులే’
– అనిల్‌ కుంబ్లే

‘చిన్న పట్టణంనుంచి వచ్చి మ్యాచ్‌ విన్నర్‌గా, గొప్ప నాయకుడిగా ఎదిగిన ధోని ప్రయాణం అద్భుతం. నువ్వు అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను’
–వీవీఎస్‌ లక్ష్మణ్‌

మా హృదయాల నుంచి రిటైర్మెంట్ లేదు
- ఠితేష్ దేశముఖ్

వరల్డ్ క్రికెట్ నే హెలికాప్టర్ షాట్స్ మిస్ అవుతుంది ..భారత క్రికెట్ అభివృద్ధిలో నువ్వు ఎప్పటికప్పుడు భాగస్వామ్యం అవుతావని ఆశిస్తున్నాను ..అమిత్ షా


Tags :
|
|
|

Advertisement