Advertisement

  • క్రికెట్ బోర్డు మరియు టీం మేనేజ్మెంట్ వేధింపులు తట్టుకోలేక కెరీర్ కు ముగింపు పలికిన క్రికెటర్

క్రికెట్ బోర్డు మరియు టీం మేనేజ్మెంట్ వేధింపులు తట్టుకోలేక కెరీర్ కు ముగింపు పలికిన క్రికెటర్

By: chandrasekar Fri, 18 Dec 2020 11:03 AM

క్రికెట్ బోర్డు మరియు టీం మేనేజ్మెంట్ వేధింపులు తట్టుకోలేక కెరీర్ కు ముగింపు పలికిన క్రికెటర్


తన దేశ క్రికెట్ బోర్డు మరియు టీం మేనేజ్మెంట్ వేధింపులు తట్టుకోలేక పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్ క్రికెట్ టీం లో పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా 2010 నుండి 2015 మధ్య కాలంలో క్రికెట్ కు దూరంగా ఉన్నప్పుడు కూడా ఈ వేధింపులను భరించి నట్లు తెలిపాడు. తను మానసిక వేధింపులు భరించలేక నే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు మరియు వారి ఆగడాలను తట్టుకోవడం నా వల్ల కావడం లేదని తెలిపాడు. ప్రస్తుతం తనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెట్టే వేధింపులు నుండి తట్టుకోలేక క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు.

మహమ్మద్ అమీర్ పాకిస్తాన్ తరఫున 61 వన్డే మ్యాచుల్లో 81 వికెట్లు పడగొట్టాడు అలాగే 50 టి20 మ్యాచ్ లో 59 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా మహ్మద్ అమీర్ 36 టెస్టు మ్యాచుల్లో 30.47 సగటుతో 119 వికెట్లను పడగొట్టాడు. ఇతను పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి టీం లోని బ్యాట్స్మెన్లను అలరించాడు. 2019 సంవత్సరంలో మహమ్మద్ అమీర్ టెస్ట్ క్రికెట్ నుండి వైదొలిగాడు మరియు అతడు లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ పై ఎక్కువగా దృష్టి సారించాలి అనే ఉద్దేశంతోనే టెస్ట్ మ్యాచ్ ల నుండి వైదొలుగుతున్నట్లు తెలియజేశాడు.

అతను టెస్ట్ మ్యాచ్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచులకు టీం మేనేజ్మెంట్ ఎంపిక చేయకుండా అతనికి విశ్రాంతి ఇవ్వడంతో పక్కన పెడుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తనకు జరుగుతున్న వేధింపుల కారణంగానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినట్లు తెలిపాడు. అతని నిర్ణయం పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ మాట్లాడుతూ ఇది అతని వ్యక్తిగత నిర్ణయం అని దీనిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గౌరవిస్తుందని ఈ వ్యవహారంపై మేము ఏమి స్పందించమని తెలియజేశాడు.


Tags :

Advertisement