Advertisement

  • కరోనా వైరస్ కారణంగా క్రికెటర్ డెలివరీ బాయ్‌గా మారాడు...

కరోనా వైరస్ కారణంగా క్రికెటర్ డెలివరీ బాయ్‌గా మారాడు...

By: chandrasekar Mon, 16 Nov 2020 4:56 PM

కరోనా వైరస్ కారణంగా క్రికెటర్ డెలివరీ బాయ్‌గా మారాడు...


కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక క్రీడలు రద్దయ్యాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ సైతం 2022కి వాయిదా పడింది. మెల్‌బోర్న్ వేదికగా నవంబర్ 15న టీ20 ఫైనల్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అంతా తలకిందులైంది. నెదర్లాండ్స్, పపువా న్యూ గినియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ లాంటి ఆరు దేశాల జట్లు టీ20 వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యాయి. ఈ జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో ప్రాథమిక దశలో తలపడాల్సి ఉంది. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు సూపర్ 12కు అర్హత సాధించేవి.

కానీ టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో నెదర్లాండ్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ పొట్ట నింపుకోవడం కోసం ఉబెర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగాల్సి ఉండగా వాయిదా పడటంతో తాను డెలివరీ బాయ్‌గా పని చేయాల్సి వస్తోందని అతడు ఆవేదన వ్యక్తం చేసాడు. పరిస్థితులు ఎలా మారిపోయాయో అంటూ అంతలోనే నవ్వుతూ ట్వీట్ చేశాడు. నెదర్లాండ్స్‌లో జన్మించిన పాల్ వాన్.. డచ్ జాతీయ జట్టు తరఫున ఐదు వన్డేలు, 41 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. 2013లో కెన్యాపై అతడు తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. నెదర్లాండ్స్ జట్టులోని కీలక ఆటగాళ్లలో అతడొకడు. పీటర్ సీలార్ నాయకత్వంలోని డచ్ టీమ్ భారత్‌లో జరగబోయే 2021 టీ20 వరల్డ్ కప్‌ ఆడనుంది. ఈ ఏడాది జరపాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను 2022లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది.

Tags :

Advertisement