Advertisement

  • ఫోన్ సిగ్నల్ కోసం ఏకంగా టవర్ వేయించిన భారత క్రికెట్ అంపైర్ ..

ఫోన్ సిగ్నల్ కోసం ఏకంగా టవర్ వేయించిన భారత క్రికెట్ అంపైర్ ..

By: Sankar Wed, 15 July 2020 3:01 PM

ఫోన్ సిగ్నల్ కోసం ఏకంగా టవర్ వేయించిన భారత క్రికెట్ అంపైర్ ..



కరోనా కారణంగా అందరు చాల కాలం ఎవరి ఇంటికి వారే పరిమితం అయ్యారు ..అయితే చాల మంది సిటీ లలో ఉండలేక తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు ..అయితే మారుమూల గ్రామాలలో ఉన్న ఉరులలో ఫోన్ సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇంటి నుంచి పనిచేయడానికి నానావస్థలు పడ్డారు ..ఇలా లాక్ డౌన్లో తన గ్రామంలో చిక్కుబడిపోయిన ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి.. అక్కడ ఫోన్ సిగ్నల్‌ కోసం చెట్లు ఎక్కాల్సి వచ్చింది.

మార్చి 16న ఉత్తరప్రదేశ్‌లోని డాంగ్రోల్ గ్రామానికి తన ఇద్దరు కొడుకులతో వెళ్లిన అనిల్ చౌదరి.. ప్రస్తుతం క్రికెట్‌ సిరీస్‌లు లేకపోడంతో అక్కడే ఉంటున్నాడు. కానీ.. ఆ గ్రామంలో ఫోన్ సిగ్నల్స్ అతనికి పెద్ద సమస్యగా మారింది. దాంతో.. నెట్‌వర్క్ కంపెనీతో మాట్లాడిన అనిల్ చౌదరి.. ఆ గ్రామంలో తాజాగా ఓ సెల్ టవర్‌ని ఏర్పాటు చేయించాడు.

గ్రామంలోని ప్రజలు ఇప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్‌లు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు వారి ఆన్‌లైన్ క్లాస్‌లను చూడగలుగుతున్నారు. నేను కూడా ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్‌, వర్క్‌షాప్‌‌లకి మా గ్రామం నుంచే అటెండ్ అవుతున్నా. మొత్తంగా.. గ్రామంలో సెల్ టవర్‌ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు’’ అని అనిల్ చౌదరి వెల్లడించాడు.

లాక్‌డౌన్ సమయంలో ఢిల్లీలో ఉన్న తన భార్యతో మాట్లాడేందుకు, ఐసీసీ కాన్ఫరెన్స్‌లకి హాజరయ్యేందుకు ఫోన్ సిగ్నల్‌ కోసం తాను ఊరి వెలుపల ఉన్న ఎత్తైన చెట్ల పైకి ఎక్కాల్సి వచ్చేదని గత ఏప్రిల్‌లో అనిల్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇప్పట్లో భారత్‌లో క్రికెట్ సిరీస్‌లు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దాంతో.. అనిల్ చౌదరి తన స్వగ్రామంలోనే మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది.

Tags :
|
|
|

Advertisement