Advertisement

  • అనారోగ్యం నుండి కోలుకొని గోల్ప్‌ కోర్సు ప్రారంభించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్

అనారోగ్యం నుండి కోలుకొని గోల్ప్‌ కోర్సు ప్రారంభించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్

By: chandrasekar Fri, 13 Nov 2020 10:49 AM

అనారోగ్యం నుండి కోలుకొని గోల్ప్‌ కోర్సు ప్రారంభించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్


కొన్ని రోజుల క్రితం అనారోగ్యం నుండి కోలుకొని గోల్ప్‌ కోర్సును క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తిరిగి ప్రారంభించారు. హర్యానా హరికేన్‌గా పేరొందిన కపిల్‌ సారథ్యంలోనే భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. ఇండియా క్రికెట్ లెజెండరీ‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ఇటీవల గుండెపోటుకు గురవడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం క్రికెట్‌ ఆడిన కపిల్‌కు గోల్ఫ్‌ ఆడటం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న కపిల్‌ మళ్లీ గోల్ఫ్‌ క్లబ్‌లో తన స్నేహితులతో కలిసి గోల్ఫ్‌ ఆడడం ప్రారంభించాడు.

కపిల్‌ దేవ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక 1994 నుంచి రెగ్యులర్‌గా గోల్ఫ్‌ ఆడుతున్నారు. పలు ఈవెంట్లలోనూ పోటీపడ్డారు. కపిల్ దేవ్ గోల్ఫ్‌ కోర్స్‌ లేదా క్రికెట్‌ మైదానంలో తిరిగి అడుగుపెడితే ఎంత సరదాగా ఉంటుంతో మాటల్లో వర్ణంచలేం. గోల్ప్‌ కోర్సులోకి మళ్లీ రావడం, సరదాగా గడపడం, స్నేహితులతో ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీవితం అంటే ఇదే అంటూ కపిల్‌ వీడియోలో పేర్కొన్నాడు. కపిల్‌ భారత్‌ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కపిల్‌ 5248 పరుగులు చేయడంతో పాటు 434 వికెట్లు పడగొట్టాడు. అల్ రౌండర్ గా క్రికెట్లో గొప్ప దిగ్గజంగా పేరుగాంచారు.

Tags :

Advertisement