Advertisement

  • బిగ్ బాష్ -10 షెడ్యూల్ విడుదల చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా ..

బిగ్ బాష్ -10 షెడ్యూల్ విడుదల చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా ..

By: Sankar Wed, 15 July 2020 11:30 AM

బిగ్ బాష్ -10 షెడ్యూల్ విడుదల చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా ..


కరోనా కారణంగా క్రికెట్ లో ప్రతిష్టాత్మక లీగ్ లలో ఒకటైన ఐపీయల్ వాయిదా పడిన విషయం తెలిసిందే ..అయితే కరోనా తగ్గుముఖం పట్టాకా మళ్ళీ ఐపీయల్ నిర్వహిస్తామని బీసీసీఐ చెబుతున్నప్పటికీ ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితులను చూస్తే ఐపీయల్ ఇప్పట్లో జరిగేలా లేదు ..అయితే ఐపీయల్ వాయిదా పడినప్పటికీ మరొక ప్రతిష్టాత్మక క్రికెట్ లీగ్ మాత్రం ప్రారంభం కానుంది ..అదే ఆస్ట్రేలియా నిర్వహించే బిగ్ బాష్ లీగ్ ..

బిగ్ బాష్ లీగ్ కి సంబంధించి ఈ ఏడాది షెడ్యూలును క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది ..బీబీఎల్​ 10వ సీజన్​ డిసెంబర్​ 3న ప్రారంభమవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. తొలి మ్యాచ్​ అడిలైడ్ స్ట్రయికర్స్​, మెల్​బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరుగనుంది. కరోనా వైరస్ వల్ల భయాందోళనలు ఉన్నా బీబీఎల్​పై ముందుకెళ్లేందుకే సీఏ నిర్ణయించుకుంది. రెండు నెలలకు పైగా జరిగే బీబీఎల్​ 10వ సీజన్​లో మొత్తం 61మ్యాచ్​లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఫైనల్ జరుగనుంది.

కాగా భారత్​ – ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కావాల్సిన రోజునే బీబీఎల్​-10 కూడా మొదలుకానుంది. దీంతో భారత్​… ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటే స్టీవ్ స్మిత్​, వార్నర్​ లాంటి కొందరు ఆసీస్ స్టార్లు బీబీఎల్​లో కొన్ని మ్యాచ్​లకు దూరం కానున్నారు. కాగా మహిళల బిగ్​బాష్ లీగ్​ ఈ ఏడాది అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 28 వరకు జరుగనుంది.

Tags :
|

Advertisement