Advertisement

  • విరాట్ కోహ్లీపై క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా సంచలన ఆరోపణలు

విరాట్ కోహ్లీపై క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా సంచలన ఆరోపణలు

By: chandrasekar Mon, 06 July 2020 2:34 PM

విరాట్ కోహ్లీపై క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా సంచలన ఆరోపణలు


కెప్టెన్ విరాట్ కోహ్లీపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా చేసిన ఫిర్యాదు ప్రస్తుతం బీసీసీఐలో కలకలం రేపుతోంది. బిసిసిఐ ఎథిక్స్ ఆఫీసర్ డికె జైన్ కలిసిన ఆయన కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా ఉంటేనే మరో ప్రైవేటు కంపెనీలో డైరక్టర్ గా ఉన్నట్లు ఆరోపించారు. బీసీసీఐ నిబంధనలకు ఇది విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గుప్తా గతంలో కూడా పలువురు ఆటగాళ్ళపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.

కోహ్లీ ఒకేసారి రెండు పదవులను కలిగి ఉన్నారని గుప్తా తన తాజా ఫిర్యాదులో ఆరోపించారు. గుప్తా తన ఆరోపణలలో ప్రధానంగా టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ కొనసాగుతూనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కో-డైరెక్టర్ గా కొనసాగుతున్నట్లు ఇది బిసిసిఐ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన ఎత్తి చూపారు. BCCI ఎథిక్స్ ఆఫీసర్ జైన్‌ దీనిపై స్పందిస్తూ 'తనకు ఫిర్యాదు వచ్చింది. మొదట తాను దానిని పరిశీలిస్తానని పేర్కొన్నారు. ఆ తర్వాత కోహ్లీ ప్రత్యుత్తరం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పి, విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్‌ఎల్‌పిలో కోహ్లీ డైరెక్టర్ అని గుప్తా పేర్కొన్నారు. ఈ సంస్థలో అమిత్ అరుణ్ సజ్దేహ్ ​ మరియు బినాయ్ భారత్ ఖిమ్జీ సహ డైరక్టర్లుగా ఉన్నారని ఆరోపించారు.

ఈ రెండు సంస్థలు కార్నర్‌ స్టోన్‌స్పోర్ట్స్ & ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భాగం. అయితే కార్నర్‌స్టోన్ స్పోర్ట్ & ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కోహ్లీకి ఎలాంటి భాగస్వామ్యం లేదు. భారత కెప్టెన్‌తో పాటు, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌తో పాటు పలువురు ఆటగాళ్ల వ్యాపార ప్రయోజనాలను సదరు కంపెనీ నిర్వహిస్తుంది. గుప్తా తన ఫిర్యాదులో ఇలా వ్రాశారు, "పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, విరాట్ కోహ్లీ ఒక సమయంలో రెండు పదవులను నిర్వహించడం భారత సుప్రీంకోర్టు ఆమోదించిన బిసిసిఐ రూల్ 38 (4) ను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. ఎథిక్స్ ఆఫీసర్ జైన్ పదవీకాలం గత నెలలో ఒక సంవత్సరం పొడిగించిన తరువాత ఇదే మొదటి పెద్ద కేసు కావడం గమనార్హం.

Tags :

Advertisement