Advertisement

  • జనసేనాని కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి ..

జనసేనాని కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి ..

By: Sankar Tue, 08 Dec 2020 1:04 PM

జనసేనాని కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి  ..


ఏపీలో ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వం సంఘీభావం తెలపడంతో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు.

విజయవాడ లెనిన్‌ సెంటర్లో రైతు సంఘాలు, కాంగ్రెస్ వామపక్ష పార్టీల ధర్నా చేస్తుండగా.. నాగళ్లతో వామపక్షాల ర్యాలీ తీశాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. జనసేనాని కూడా రైతుల పక్షాన నిలబడాలని.. పంట నష్టం విషయంలో పవన్‌ ఏ విధంగా దీక్ష చేశారో.. అదే విధంగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఉద్యమించాలని తెలిపారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తినప్పుడే ప్రజలు పవన్‌ కళ్యాణ్ ను నమ్ముతారన్నారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ... ఒన్ నేషన్‌-ఒన్‌ ట్యాక్స్‌ అనే విధానంతో జీఎస్టీ తెచ్చి ఇబ్బందులు సృష్టించారని... ఇప్పుడు ఒన్ నేషన్‌-ఒన్‌ మార్కెట్‌ అనే నినాదం తెస్తున్నారని ఫైర్‌ అయ్యారు. బిల్లులకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటిస్తే సరిపోదు.. వైసీపీ, టీడీపీలు ఉద్యమించాలని డిమాండ్‌ చేశారు.

Tags :
|

Advertisement