Advertisement

  • కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ తుది విడత మానవ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభ౦

కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ తుది విడత మానవ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభ౦

By: chandrasekar Wed, 23 Sept 2020 1:34 PM

కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ తుది విడత మానవ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభ౦


ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ తుది విడత మానవ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి.

మహారాష్ట్రలోని ప్రభుత్వ సాసున్ జనరల్ హాస్పిటల్‌లో మానవ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను 150 నుంచి 200 వలంటీర్లకు ఇస్తున్నట్లు హాస్పిటల్ డీన్ డాక్టర్ మురళీధర్ తంబే అన్నారు. టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ భారతి విద్యాపీఠ్‌ వైద్య కళాశాల, నగరంలోని కేఈఎం హాస్పిటల్ లో జరిగాయి.

వ్యాక్సిన్‌ను సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా బ్రిటిష్‌- స్వీడిష్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యంతో పరీక్షలు నిర్వహిస్తోంది. టీకాను ఆక్స్‌ఫర్డ్‌ విద్యాలయం అభివృద్ధి చేసింది.

బ్రిటన్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్‌ అస్వస్థతకు గురికావడంతో ఈ నెలలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్‌ 11న వ్యాక్సిన్‌ రెండో దశ, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిలిపివేయాలని సీరం ఇనిస్టిట్యూట్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఎలాంటి ఇబ్బందులు లేవని తేలడంతో పలు షరతులతో సెప్టెంబర్‌ 15న ప్రయోగాలకు డీసీజీఐ పర్మిషన్ ఇచ్చింది.

Tags :
|

Advertisement