Advertisement

తెలంగాణలో ఒక్కరోజే 3018 కోవిడ్ పాజిటివ్ కేసులు

By: Dimple Fri, 28 Aug 2020 00:37 AM

తెలంగాణలో ఒక్కరోజే 3018 కోవిడ్ పాజిటివ్ కేసులు

తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 61,040 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 3,018 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైన ఫలితాల్లో ఇవే అత్యధికం. వీటితో కొవిడ్‌ కేసుల సంఖ్య 1,11,688కు... పరీక్షల సంఖ్య 10,82,094కు చేరింది. ఇప్పటికే సేకరించిన నమూనాల్లో మరో 1,176 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఈనెల 25న రాత్రి 8 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని బుధవారం వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. తాజాగా మరో 10 మంది కొవిడ్‌తో మృతి చెందగా, ఇప్పటిదాకా కరోనా మరణాల సంఖ్య 780గా ఉంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 475 కేసులు నమోదయ్యాయి. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 475, మరో 9 జిల్లాల్లో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తొమ్మిది జిల్లాల్లో రంగారెడ్డి(247), మేడ్చల్‌ మల్కాజిగిరి(204), నల్గొండ(190), ఖమ్మం(161), వరంగల్‌ నగర(139), నిజామాబాద్‌(136), కరీంనగర్‌(127), మంచిర్యాల(103), జగిత్యాల(100) ఉన్నాయి. జిల్లాల్లో కరోనా విజృంభిస్తున్నట్లుగా తాజా గణాంకాల్లో వెల్లడవుతోంది. మరో 21 జిల్లాల్లోనూ 20కి పైగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. వాటిలో భద్రాద్రి కొత్తగూడెం(95), సిద్దిపేట(88), పెద్దపల్లి(85), కామారెడ్డి(76), రాజన్న సిరిసిల్ల(69), సూర్యాపేట(67),

వరంగల్‌ గ్రామీణ(61), సంగారెడ్డి(61), మహబూబాబాద్‌(60), మహబూబ్‌నగర్‌(56), జనగామ(52), వనపర్తి(46), యాదాద్రి భువనగిరి(44), నిర్మల్‌(41), మెదక్‌(40), నాగర్‌కర్నూల్‌(38), జోగులాంబ గద్వాల(37), ఆదిలాబాద్‌(28), ములుగు(26), వికారాబాద్‌(21), జయశంకర్‌ భూపాలపల్లి(20) ఉన్నాయి. కేవలం కుమురం భీం(11), నారాయణపేట(14) జిల్లాల్లో మాత్రమే స్వల్ప సంఖ్యలో కేసులు నిర్ధారణ అయ్యాయి.
అందుబాటులో పడకలు ఇలా... కొవిడ్‌ చికిత్సల కోసం ప్రభుత్వ వైద్యంలో మొత్తంగా 7,952 పడకలను కేటాయించగా, మంగళవారం నాటికి 5,514 పడకలు ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలో మొత్తం 9,060 కేటాయించగా 4,926 పడకలు ఖాళీగా ఉన్నాయి.

Tags :
|

Advertisement