Advertisement

కోవిడ్-19 ప్రపంచ స్థాయిలో పోటీపడుతున్న భారత్

By: chandrasekar Sat, 08 Aug 2020 7:13 PM

కోవిడ్-19 ప్రపంచ స్థాయిలో పోటీపడుతున్న భారత్


కరోనా వైరస్ ప్రపంచ స్థాయిలో వేగంగా వ్యాపిస్తున్న వేళ భారత్ ఎక్కువ జనాభా కలిగి ఉండడంతో హాట్ స్పాట్ గా కానున్నది. ఆగస్టులో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా భారత్ నిలవనుంది. ఈ నెలలో ఇప్పటి వరకు అమెరికా, బ్రెజిల్ కంటే రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే, ఆగస్టు నెల తొలి ఆరు రోజుల్లోనే ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు భారత్‌లో చోటుచేసుకున్నాయి. వ్యాప్తి సంఖ్య రోజు రోజుకి అధికారేట్లుగా నమోదవుతున్నాయి.

దేశంలో శుక్రవారం కూడా వరుసగా రెండో రోజు 60వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా 926 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో నమోదయిన కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. ఈ నెల తొలి ఆరు రోజుల్లో మొత్తం 3,28,903 కేసులు నమోదయ్యాయి. అదే ప్రపంచంలోనే అత్యధికం కరోనా కేసులున్న అమెరికాలో 3,26,111, బ్రెజిల్‌లో 2,51,264 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆగస్టు 2,3,5,6 తేదీల్లో ఒక్క రోజు ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్‌లో నిర్ధారణ అయ్యాయి.

దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు గురువారం నాటికి 20 లక్షలు దాటాయి. అలాగే, అమెరికా, బ్రెజిల్ కంటే భారత్‌లో వైరస్ వృద్ధిరేటు 3.1 శాతంగా ఉంది. బ్రెజిల్, అమెరికాలో గత ఆరు రోజుల్లో మొత్తం 6వేల మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఒక్క భారత్‌లోనే 5,075 మంది చనిపోయారు. శుక్రవారం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో 10వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. కనీసం ఐదు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి.

వీటిలో బీహార్ 3,646, తెలంగాణ 2,207, ఒడిశా 1,833, పంజాబ్ 1,063, మణిపూర్ 249 కేసులు వెలుగుచూశాయి. వరుసగా మూడో రోజు మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు 10వేలు దాటాయి. అలాగే, 300 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం 10,483 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 4,90,262కి, మరణాలు 17,092కి చేరాయి.

అధిక కేసులు నమోదవుతున్న ముంబయిలో వరుసగా రెండో రోజు 1,000లోపు కేసులు నమోదయ్యాయి. గత పది రోజులతో పోల్చితే శుక్రవారం నమోదయిన 862 కేసులు అత్యల్పం. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ మరణాలు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. శుక్రవారం 10,171 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో మరో 89మంది మరణించారు. ఇంతవరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మరణాల్లో ఇవే ఎక్కువ. మార్చి 12 ఏపీలో తొలి కేసు నమోదుకాగా 135 రోజుల్లో జులై 27 నాటికి లక్షకు చేరాయి. అయితే, ఇవి రెండు లక్షలకు చేరడానికి పది రోజులు మాత్రమే పట్టింది. మరింతగా పెరుగుతున్న కేసులవల్ల ప్రపంచ స్థాయిలో పెద్ద హాట్ స్పాట్ గా మారనుంది.

Tags :
|

Advertisement