Advertisement

  • జనవరి లో కరోనా కు వ్యాక్సిన్ ..గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్

జనవరి లో కరోనా కు వ్యాక్సిన్ ..గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్

By: Sankar Fri, 02 Oct 2020 6:34 PM

జనవరి లో కరోనా కు వ్యాక్సిన్ ..గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్


కరోనా కేసులు దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వాక్సిన్ వచ్చే వరకు వైరస్ తో సహజీవనం చేయక తప్పనిసరి పరిస్థితి. అయితే, దేశంలో మూడు కంపెనీలు వాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. వివిధ దశల్లో ట్రయల్స్ లో ఉన్నాయి. త్వరలోనే ఈ ట్రయల్స్ పూర్తికానున్నాయి.

దేశంలో వ్యాక్సిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ఇప్పటికే అనేక రకాల అనుమానాలు కలుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వాక్సిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. జనవరిలో ఇండియాలో వాక్సిన్ రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు. అన్ని దశలను పూర్తి చేసుకొని వాక్సిన్ రిలీజ్ చేస్తారని తెలిపారు.

వాక్సిన్ రిలీజ్ తరువాత, దేశంలో ఒకేసారి అందరికి వాక్సిన్ అందుబాటులో ఉండేంతగా ఉత్పత్తి జరగదని, భారీ స్థాయిలో ఉత్పత్తి జరగాలంటే సమయం పడుతుందని తెలిపారు. మొదట కరోనా ముప్పు అధికంగా ఉన్నవారికి మొదట వాక్సిన్ అందుబాటులో ఉంటుందని తరువాత మిగిలినవారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Tags :
|

Advertisement