Advertisement

  • కరోనా జాగ్రత్తలపై సూచనలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ ..

కరోనా జాగ్రత్తలపై సూచనలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ ..

By: Sankar Fri, 10 July 2020 7:41 PM

కరోనా జాగ్రత్తలపై సూచనలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ ..



కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ కష్టకాలంలో ప్రజలను ఎప్పటిప్పుడు చైతన్య వంతులను చేయడంలో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాల్‌సెంటర్‌ ద్వారా ఇంటి వద్దే ఉన్న కోవిడ్‌ పాజిటివ్‌ రోగుల బాగోగులు తెలుసుకుంటున్నారు. వాళ్లకి ఫోన్ చేసి ఆరోగ్య సమాచారం సేకరించి తగిన విధంగా కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కరోనా లక్షణాలు తక్కువ ఉన్నవారికి టెలిమెడిసిన్‌ కన్సల్టేషన్‌ ద్వారా వైద్య సలహాలు ఇస్తున్నారు. కాల్‌ సెంటర్‌ సిబ్బంది రెండు విడతల్లో సుమారు 200 మంది టెలీకాలర్స్‌తో పని చేస్తోంది.

ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న సుమారు 10 వేల మంది కోవిడ్‌ బాధితులను ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమతుల ఆహారం వంటి సలహాలు, సూచనలు చేస్తున్నారు. కోవిడ్‌ బాధితులు తీవ్రమైన శ్వాస సంబంధ సమస్య లేదా ఛాతినొప్పితో బాధపడుతుంటే వారి వివరాలను సేకరించి వెంటనే 108 ద్వారా మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నెంబరు 1800 599 4455 కు హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగితోపాటు ఆ వ్యక్తికి సేవలు అందించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. కోవిడ్‌కు సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు తెలుసుకోవాలనుకునే వారు ఈ నెంబరుకు కాల్‌చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

Tags :
|

Advertisement