Advertisement

  • కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే గంటల కొద్దీ లైన్లో ఉండాల్సిందే ..

కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే గంటల కొద్దీ లైన్లో ఉండాల్సిందే ..

By: Sankar Mon, 03 Aug 2020 11:55 AM

కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే గంటల కొద్దీ లైన్లో ఉండాల్సిందే ..



ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా బాధిత కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్స్‌తో పాటు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కన్పిస్తే చాలు జిల్లా జనరల్‌ ఆస్పత్రికి వెళ్తున్నారు. కోవిడ్‌ పరీక్ష కోసం నమూనాలు సేకరించాలని క్యూలైన్‌లో నిలబడుతున్నారు. కానీ అక్కడ పని చేసే వైద్య సిబ్బంది, అధికారులు మాత్రం పార్టీల నేతలు, ఇతర అధికారుల సిఫారసు ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇక గంటల పాటు క్యూ లైన్‌లో నిలబడిన సామాన్యుడి సహనాన్ని పరీక్షిస్తున్నారు.

ఈ రోజు ఇంత మందికే చేస్తామని తిప్పి పంపిస్తున్నారు. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి పరీక్షల కోసం వచ్చేవారు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వంద మందికిపైగా క్యూలైన్‌లో ఉంటే మరో రోజు రావాలని తిప్పి పంపుతున్నారు. చేసేదేమీ లేక వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

కాగా జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో తీసుకుంటున్న నమూనా సేకరణలో ఆస్పత్రి సిబ్బంది మొదటి ప్రాధాన్యత సీరియస్‌ ఉన్న వారికే ఇస్తున్నాం. అందరూ ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం పని చేస్తున్నాం. ప్రతి రోజు ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతి కింద 90మంది వరకు నమూనాలు.. ర్యాపిడ్‌ పద్ధతిలో 50నుంచి 60మందికి పరీక్షలు చేస్తున్నాం. ఈ క్రమంలో ఎలాంటి సిఫారసులు వచ్చినా.. ఆయాసం, దగ్గు, జలుబు ఇలా సీరియస్‌గా ఉన్న వారికి మొదట పరీక్షలు చేస్తాం అని అన్నారు జిల్లా డాక్టర్ రామ కిషన్


Tags :
|

Advertisement