Advertisement

కరోనా చర్యల్లో ఆంధ్రప్రదేశ్‌దే ముందడుగు

By: Dimple Wed, 19 Aug 2020 11:44 PM

కరోనా చర్యల్లో ఆంధ్రప్రదేశ్‌దే ముందడుగు

కరోనా కోరలు చాచుతోంది. అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలు చేపట్టడంలో సఫలీకృతమైంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందంజలో ఉంది.
రాష్ట్ర జనాభాలో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 5.65 శాతం మందికి కరోనా పరీక్షలు చేసింది. ఒక మిలియన్‌ జనాభాకు 56, 541 టెస్టులతో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికి వరకు మొత్తం 30,19, 296 టేస్టులు జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 57,685 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,742 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16003కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 8,061 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 86 మంది మృత్యువాత పడ్డారు.

Tags :

Advertisement