Advertisement

  • కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రాష్ట్రాల జాబితాలో తొలి రెండు స్థానాలలో ఢిల్లీ , తమిళనాడు

కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రాష్ట్రాల జాబితాలో తొలి రెండు స్థానాలలో ఢిల్లీ , తమిళనాడు

By: Sankar Thu, 27 Aug 2020 3:34 PM

కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రాష్ట్రాల జాబితాలో తొలి రెండు స్థానాలలో ఢిల్లీ , తమిళనాడు


దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంబిస్తున్నప్పటికీ రికవరీ రేట్ కూడా అదే స్థాయిలో ఉంది.. దేశంలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

రాష్ట్రాల వారీగా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి జాబితాలో ఢిల్లీ, తమిళనాడు తొలిరెండు స్థానాల్లో నిలిచాయి. 90 శాతం రికవరీ రేటుతో ఢిల్లీ ప్రథమం స్థానం, 85 శాతంతో తమిళనాడు రెండోస్థానంలో ఉన్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. రోజువారీ పరీక్షల నిర్వహణ సైతం ఘనణీయంగా పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది.

వైరస్‌బారినపడి కోలుకుంటున్న వారిలో బీహార్ (83.80) మూడో స్థానం, డామన్‌డయ్యు, దాద్రా నగర్ హవేలి (82.60 శాతం) నాలుగోస్థానం, హర్యానా (82.10 శాతం) ఐదోస్థానం, గుజరాత్ (80.20 శాతం) ఆరోస్థానంలో ఉన్నాయి. సమగ్ర నిఘా ద్వారా కాంటాక్ట్లను గుర్తించడం, రోగులకు సకాలంలో చికిత్స అందిస్తుండడంతో కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోందని, కేసుల సంక్రమణ శాతం (సీఎఫ్‌ఆర్‌) తగ్గుతోందని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేస్‌ ఫెర్టిలిటీ రేట్‌ ( సీఎఫ్‌ఆర్‌) జాబితాలో 0.27శాతంతో అస్సాం అగ్రస్థానంలో ఉండగా, కేరళ 0.39 శాతం, బీహార్ 0.42 శాతం, ఒడిశా 0.51 శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే రికవరీ, మరణాల శాతం చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువగా ఉందని పేర్కొంది.

Tags :
|

Advertisement