Advertisement

  • తెలుగు రాష్ట్రాల్లో అమాంతంగా పెరుగుతున్నకరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో అమాంతంగా పెరుగుతున్నకరోనా కేసులు

By: Dimple Sat, 22 Aug 2020 10:49 PM

తెలుగు రాష్ట్రాల్లో అమాంతంగా పెరుగుతున్నకరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒక లక్షదాటాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడులక్షల యాభైవేలకేసులకు చేరువవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 2,474 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 7 మంది మృతి చెందారు.

దీంతో మృతుల సంఖ్య 744 కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,768 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 78,735కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 22,386 ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య 8,91,173కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న అత్యధికంగా 447 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 61,469 నమూనాలను పరీక్షించగా వారిలో 10,276 మందికి ఈ వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు నమోదు చేసిన వివరాలను అందులో పేర్కొంది.

ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 97 మంది మృతి చెందారు. చిత్తూరులో 13, అనంతపురం 11, నెల్లూరు 10, తూర్పుగోదావరి 8, కడప 8, కర్నూలు 8, గుంటూరు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, కృష్ణా 3, విజయనగరంలో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 3,189కి చేరింది. 24 గంటల్లో 8,593 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రంలో 31,91,326 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Tags :

Advertisement