Advertisement

దేశంమొత్తంలో 28 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

By: Sankar Tue, 21 July 2020 11:54 AM

దేశంమొత్తంలో 28 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య



భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య 28 వేలకు పైబడింది. గత 24 గంటల్లో 37,148 కేసులు నమోదయ్యాయి. 587మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇంతవరకు కరోనా బారిన పడి మరణించినవారి సంఖ్య 28,084కు చేరింది. 11,55,191 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 4,02,529 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇంతవరకు చికిత్స నుంచి 7,24,578 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో కోవిడ్ మరణాల్లో భారత్ 7వ స్థానానికి చేరుకుంది. ప్రతి రోజు దేశవ్యాప్తంగా 40 వేల కేసులు బయటపడుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య ఎక్కువగా చేస్తున్నందువల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది.

కాగా ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఊరట కలిగించే అంశం ..ఎందుకంటే దేశ వ్యాప్తంగా అత్యధిక కేసుల విషయంలో మొన్నటిదాకా మొదటి స్థానం కోసం పోటీ పడ్డ ఢిల్లీ ఇలా కరోనా కేసుల నియంత్రణలో విజయం సాధిస్తుండటంతో మిగిలిన ప్రభుత్వాలకు కూడా కరోనా నియంత్రణ మీద నమ్మకం కలిగింది ..

Tags :
|
|

Advertisement