Advertisement

జీహెచ్‌ఎంసీలో హోమ్ ఐసోలేషన్ కిట్ల పంపిణి ..

By: Sankar Tue, 14 July 2020 6:22 PM

జీహెచ్‌ఎంసీలో హోమ్ ఐసోలేషన్ కిట్ల పంపిణి ..



కోవిడ్‌– 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ కరోనా వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి ఇంట్లోనే హోం ఐసోలేషన్‌గా ఉంటూ చికిత్స పొందుతున్న వారి కోసం ఇళ్లకే ‘హోం ఐసోలేషన్‌ కిట్‌’ పంపిణీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ద్వారా పాజిటివ్‌ వ్యక్తులున్న ఇళ్లకు వీటిని అందజేస్తున్నారు. గతంలో సమీపంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు వెళ్లిన హోం ఐసోలేషన్‌లోని వారికి వీటిని అందజేశారు. దాదాపు పది రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా నేరుగా బాధితుల ఇళ్లకే వీటిని పంపిణీ చేస్తున్నారు.

ఇప్పటి వరకు 20వేల కిట్స్‌ తెప్పించిన జీహెచ్‌ఎంసీవాటిల్లో 15 వేలు పంపిణీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఐదువేలు అందుబాటులో ఉండగా, పాజిటివ్‌ కేసుల సంఖ్యను బట్టి కిట్లను తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 17 రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని, అందుకనుగుణంగా అన్ని రోజులకు సరిపడేలా.. త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడే వస్తువులు, టాబ్లెట్లు ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారుకిట్‌ బ్యాగ్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌– 19 నియంత్రణకు జారీ చేసిన సలహాలు, సూచనలు తెలుస్తాయని పేర్కొన్నప్పటికీ, స్కాన్‌ చేసిన కొందరు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లింక్‌ వస్తోందని తెలిపారు.


Tags :
|
|

Advertisement