Advertisement

  • 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఎన్‌రోల్ ప్రక్రియ పూర్తి చేసిన 'కోవీషీల్డ్'

3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఎన్‌రోల్ ప్రక్రియ పూర్తి చేసిన 'కోవీషీల్డ్'

By: chandrasekar Thu, 12 Nov 2020 5:46 PM

3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఎన్‌రోల్ ప్రక్రియ పూర్తి చేసిన 'కోవీషీల్డ్'


దేశంలో కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ కోసం ఫార్మ దిగ్గజ కంపెనీలన్నీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో కోవీషీల్డ్ టీకా మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వహించేందుకు ఎన్‌రోల్‌మెంట్ ప్ర‌క్రియ పూర్తి అయిన‌ట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) గురువారం తెలిపాయి. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్ధతో క‌లిసి‌ సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా ఐసీఎంఆర్ సాయంతో కోవీషీల్డ్ టీకాను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ మేరకు కోవీషీల్డ్ త‌యారీకి అయ్యే ఇత‌ర ఖ‌ర్చుల‌ను సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఫండిగ్ చేసిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

దేశంలోని 15 ప్రాంతాల్లో కోవీషీల్డ్ టీకా రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. ఈ ప్రయోగ పరీక్షలను సీర‌మ్‌, ఐసీఎంఆర్‌ నిర్వ‌హిస్తున్నాయి. అక్టోబ‌ర్ 31వ తేదీ నాటికే 1600 మందిని ఎన్‌రోల్ చేసిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. సీరమ్ సంస్థ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివర్సిటీ కరోనా టీకాను ఉత్పత్తి చేసే బాధ్యతను అంతకుముందు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీరమ్ ఉత్పత్తి ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. అయితే ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పలు దేశాల్లో జరుగుతున్నాయి.

Tags :

Advertisement