Advertisement

ఐఫోన్‌ 12 ధరలు తక్కువగా ఉన్న దేశాలు... భారత్‌లో?

By: chandrasekar Wed, 21 Oct 2020 3:32 PM

ఐఫోన్‌ 12 ధరలు తక్కువగా ఉన్న దేశాలు... భారత్‌లో?


అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు కొత్త మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ కొత్త ఫోన్‌ను ఒకేసారి లాంచ్‌ చేయడం ఇదే ఫస్ట్ టైం. యాపిల్ ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌ విడుదల చేశారు. రిటైల్‌ స్టోర్లలో ఈ నెలాఖరులోగా ఫోన్లు అందుబాటులో రానున్నాయి. అంతర్జాతీయంగా ఐఫోన్‌ 12 సిరీస్ ‌ ధరలతో పోలిస్తే ..భారత్‌లో వీటి ధర ఎక్కువగానే ఉంది. భారత్‌లో ఐఫోన్‌ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలంటే యాపిల్‌ ప్రియులు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికా, హాంకాంగ్‌, జపాన్‌, యూఏఈ(దుబాయ్‌)లలో తక్కువ ధరకు వీటిని కొనుగోలు చేయొచ్చు. హాంకాంగ్‌లో ఐఫోన్‌ మినీ(64జీబీ) ధర సుమారు రూ.56,804 కాగా అదే మోడల్‌ ధర భారత్‌లో రూ.69,900గా ఉంది. హాంకాంగ్‌లో ఐఫోన్‌ ప్రొ మ్యాక్స్‌(128జీబీ) రూ.89,005 ఉండగా.. భారత్‌లో ఈ వేరియంట్‌ కోసం రూ.1,29,900 చెల్లించాల్సి వస్తుంది. ఈ రెండు దేశాల్లో ప్రొ మ్యాక్స్‌ ఫోన్‌ ధరలో రూ.40,895 వ్యత్యాసం ఉండటం గమనార్హం. బ్రిటన్‌లో ఐఫోన్‌ 12(64జీబీ) ధర రూ.75,905 కాగా భారత్‌లో బేస్‌ మోడల్‌ ధర రూ. 79,900గా ఉంది. ఐఫోన్‌ 12 అమెరికాలో చౌకగా లభిస్తుంది. సేల్స్‌ ట్యాక్స్‌ను కలిపినప్పటికీ ఆదేశంలో ఐఫోన్‌ 12 తక్కువ ధరకే అందుబాటులో ఉంది. పలు దేశాల్లో యాపిల్‌ ఫోన్ల ధరలు భారత్‌లో కన్నా ఎక్కువగానే ఉన్నాయి. అమెరికా, జపాన్‌ వంటి దేశాల్లో ఫోన్ల ధరలు తక్కువగా ఉంటున్నాయి. 130కోట్ల జనాభా ఉన్న భారత్‌లో యాపిల్‌ ఐఫోన్లకు ఎప్పుడూ భారీ డిమాండ్‌ ఉంటున్నది. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రొలను అక్టోబర్‌ 23 నుంచి ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చు. నాలుగు ఐఫోన్‌ 12 మోడళ్ల ధరలు ఇలా ఉన్నాయి.


Tags :
|

Advertisement