Advertisement

  • వరల్డ్ టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితాను వెల్లడించిన కౌంటర్ పాయింట్

వరల్డ్ టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితాను వెల్లడించిన కౌంటర్ పాయింట్

By: chandrasekar Tue, 14 July 2020 3:28 PM

వరల్డ్ టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితాను వెల్లడించిన కౌంటర్ పాయింట్

కౌంటర్ పాయింట్ మార్కెట్ అనే సంస్థ తాజా రీసెర్చ్ ప్రకారం స్మార్ట్ ఫోన్ల సేల్ భారీగా పడిపోయింది. కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మునుపెన్నడూ లేనంత పతనాన్ని చవిచూసింది. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రపంచంలో టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితాను కౌంటర్ పాయింట్ వెల్లడించింది.

* శాంసంగ్

శాంసంగ్ మళ్లీ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లలో 20 శాతం ఫోన్లు శాంసంగ్ వే కావడం విశేషం. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో శాంసంగ్ మొత్తంగా 5.9 కోట్ల స్మార్ట్ ఫోన్ల సేల్స్ జరిగింది.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* హువావే

ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన ఫోన్లలో హువావే ఫోన్లు 17 శాతం ఉన్నాయి. 4.9 కోట్ల స్మార్ట్ ఫోన్లను హువావే మొదటి మూడు నెలల్లో విక్రయించింది.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* యాపిల్

ఈ జాబితాలో మూడో స్థానంలో యాపిల్ ఉంది. యాపిల్ మార్కెట్ షేర్ 14 శాతంగా ఉండగా.. మొత్తంగా 4 కోట్ల ఐఫోన్లు ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో అమ్ముడుపోయాయి.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* షియోమీ

భారతదేశ నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే ఫోన్లలో షియోమీ ఫోన్లు 10 శాతం ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో షియోమీ ప్రపంచవ్యాప్తంగా 2.97 కోట్ల ఫోన్లు విక్రయించింది.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* ఒప్పో

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఒప్పో 2020 మొదటి మూడు నెలల్లో 2.23 కోట్ల ఫోన్లను విక్రయించడం విశేషం.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* వివో

వివో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. 2020 మొదటి మూడు నెలల్లో వివో ప్రపంచవ్యాప్తంగా 2.16 కోట్ల స్మార్ట్ ఫోన్లను విక్రయించింది.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* రియల్ మీ

ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మీ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో రియల్ మీ కూడా ఒకటి. రియల్ మీ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 72 లక్షల స్మార్ట్ ఫోన్లను అమ్మింది.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* ఎల్జీ

దక్షిణకొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఎల్జీ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 69 లక్షల వరకు సేల్స్ అయ్యాయి.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* లెనోవో గ్రూప్

ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో లెనోవో, మోటొరోలా గ్రూప్ ఉంది. ఇందులో లెనోవో, మోటొరోలా రెండు బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. ఈ బ్రాండ్లకు సంబంధించిన ఫోన్లు ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 50 లక్షల వరకు సేల్స్ జరిగింది.

counterpoint,reveals,list of world,top 10,smartphone brands ,వరల్డ్ టాప్10, స్మార్ట్ ఫోన్, బ్రాండ్ల జాబితాను, వెల్లడించిన, కౌంటర్ పాయింట్

* టెక్నో

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో ఈ జాబితాలో పదో స్థానంలో ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే బ్రాండ్లలో టెక్నో ముందుంటుంది. ఈ బ్రాండ్ కు చెందిన ఫోన్లు ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 47 లక్షలకు పైగానే అమ్ముడయ్యాయి.

Tags :
|

Advertisement