Advertisement

  • రిపబ్లిక్ డే కి బ్రిటన్ ప్రధాని రావడంపై సందిగ్ధం

రిపబ్లిక్ డే కి బ్రిటన్ ప్రధాని రావడంపై సందిగ్ధం

By: Sankar Thu, 24 Dec 2020 9:27 PM

రిపబ్లిక్ డే కి బ్రిటన్ ప్రధాని రావడంపై సందిగ్ధం


వచ్చే ఏడాది జనవరిలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనపై సందిగ్ధం నెలకొంది. జనవరిలో ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు భారత ప్రభుత్వం ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

బ్రిటన్‌ కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పర్యటన కొనసాగకపోవచ్చని కౌన్సిల్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ అసోసియేషన్‌ చైర్‌ డాక్టర్‌ చాంద్‌ నాగ్‌పాల్‌ పేర్కొన్నారు. స్పష్టంగా ఐదువారాల తర్వాత జరిగే పర్యటనపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, వైరస్‌ వ్యాప్తిపై ఆధారపడి ఉంటుందని, ఇదేస్థాయి ఇన్ఫెక్షన్‌, వ్యాప్తి కొనసాగితే కష్టమేనని చెప్పారు. లండన్‌తో పాటు పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ అమలులో ఉందని తెలిపారు.

కొత్త వైరస్‌ను ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో సెప్టెంబర్‌లోనే గుర్తించినట్లు తెలిపారు. కొత్త వైరస్‌ ప్రస్తుతం ఉన్నదాని తీవ్రత, మరణాల్లో ఎలాంటి మార్పు లేదని, 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇది పెద్ద సవాల్‌గా మారిందని నాగ్‌పాల్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఇటలీ, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియాలో ఇలాంటి కేసులు కనిపించాయని, భారత్‌ సహా ఇతర అనేక దేశాలకు వైరస్‌ చేరి ఉంటుందన్నారు

Tags :
|

Advertisement