Advertisement

  • వెంకటగిరి పోలీసు స్టేషన్‌లో 11 మంది పోలీసులకు కరోనా వైరస్ పాజిటివ్‌

వెంకటగిరి పోలీసు స్టేషన్‌లో 11 మంది పోలీసులకు కరోనా వైరస్ పాజిటివ్‌

By: chandrasekar Mon, 06 July 2020 2:06 PM

వెంకటగిరి పోలీసు స్టేషన్‌లో 11 మంది పోలీసులకు కరోనా వైరస్ పాజిటివ్‌


దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీసులన్న తేడా లేకుండా అందరిపైన వైరస్ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఓ పోలీసు స్టేషన్ మూతపడింది. అదేంటి.. పోలీసు స్టేషన్ మూతపడడం ఏంటి అనుకుంటున్నారా?. అవును నిజంగానే స్టేషన్ మూతపడింది.

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పోలీసు స్టేషన్‌లో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. ఒక్క ఆ పోలీసు స్టేషన్‌లో 11 మంది పోలీసులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

వెంకటగిరి పోలీసు స్టేషన్ సీఐతో పాటు ఎస్ఐకి సైతం వైరస్ సోకింది. వీరితో పాటు మరో ఏడుగురు కానిస్టేబుల్స్‌కు, హోంగార్డుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పోలీసు స్టేషన్‌లో పనిచేసే మహిళా స్వీపర్లు, మర్డర్ కేసులో నిందితుల ద్వారా కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. పోలీసుల కుటుంబ సభ్యులకు సైతం వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags :

Advertisement